• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత మనసుకైన గాయం ఏంటి?

సమంత మనసుకైన గాయం ఏంటి?

| సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 'ఖుషి' తర్వాత సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-03-08 10:39 GMT

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 'ఖుషి' తర్వాత సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మాయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సామ్.. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. లేటెస్టుగా ఆమె పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫెమినా ఇండియా మ్యాగజైన్ కోసం చేసిన ఈ ఫొటో షూట్ పై నెట్టింట భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె కిల్లర్ లుక్ లో స్టన్నింగ్ గా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం మేకప్ బాగాలేదని, హెయిర్ స్టైలింగ్ సెట్ అవ్వలేదని అభిప్రాయ పడుతున్నారు. ఈ సంగతి అటుంచితే, ఫెమినాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

ఫెమినాకు ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, మనపై మనకున్న విశ్వాసమే గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సాయపడుతుందని పేర్కొంది. తన జీవితంలో చాలా తక్కువ సార్లు ఆత్మవిశ్వాసం, ఆత్మన్యూనత కలిగి ఉన్నానని తెలిపింది. నేను అభద్రతాభావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగాను. దాన్నుంచి త్వరగా బయటకు వచ్చాను. బాహ్య గాయాలు కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుందని మ్యాగజైన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ వ్యాఖ్యానించింది.

సమంత అంతర్గత గాయం, మనసుకైన గాయం అని కామెంట్లు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె గత కొన్ని నెలలుగా మైయోసిటిస్‌ వ్యాధితో పోరాడుతుండటం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా? లేదా విడాకులు తీసుకోవడం గురించి ఇలా మాట్లాడిందా? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫెమినా ఇంటర్వ్యూలో సామ్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

'ఏంమాయ చేసావే' సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన అక్కినేని నాగచైతన్య, సమంత.. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. నాలుగేళ్లు గడవకముందే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకే తాను మైయోసిటిస్‌ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూ, సినిమాల నుంచి విరామం తీసుకుంది.

గతేడాది 'శాకుంతలం', 'ఖుషి' చిత్రాలతో పలకరించిన సామ్.. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదు. ఆల్రెడీ కమిటైన సినిమాల నుంచి తప్పుకోవడంతో, అవి వేరే హీరోయిన్ల చేతికి వెళ్లిపోయాయి. సమంత చివరగా నటించిన 'సిటాడెల్' అనే స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ త్వరలోనే రాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇది రూసో బ్రదర్స్ 'సిటాడెల్‌' అమెరికన్‌ టీవీ సిరీస్‌ కు ఇండియన్‌ వెర్షన్. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందినఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Tags:    
  • Samantharuthprabhu 
  • Samantha 
  • Femina 
  • Nagachaitanya 
  • Khushimovie 
  • Citadelseries.Samanthahealth 

Similar News

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

Copyright @2026

Powered by Blink CMS