• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సామ్ కిల్లర్ లుక్.. హై...

సామ్ కిల్లర్ లుక్.. హై గ్లామర్ ట్రీట్

| తాజాగా ఫెమినా ఇండియా మ్యాగజైన్ పై దర్శనమిచ్చింది సమంత. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఫెమినా మ్యాగజైన్.. సామ్ ఫొటోను పబ్లిష్ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-03-07 15:50 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక యాత్రలతోపాటు జీవితాన్ని ఉల్లాసంగా గడిపేందుకు ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఇటీవల మలేసియాలోని ఓ నీటి కొలనులో బికినీతో దిగిన ఫొటోలు పోస్ట్ చేసింది. అవి ఎంతటి వైరల్ అయ్యాయో తెలిసిందే.

 

ఆ పిక్స్ కు గంటలోనే 15 లక్షల లైక్స్ రావడం విశేషం. తాజాగా తిరుపతి వెళ్లింది సమంత. ఇక మయోసైటిస్ నుంచి మెల్లగా కోలుకుంటూ ఈ మధ్యే ఇండస్ట్రీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ సిరీస్ 2024లోనే రిలీజ్ కానుంది. దీని తర్వాత మరో ప్రాజెక్ట్ కు ఇప్పటి వరకు కూడా సామ్ ఓకే చెప్పలేదు.

 

తాజాగా ఫెమినా ఇండియా మ్యాగజైన్ పై దర్శనమిచ్చింది సమంత. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఫెమినా మ్యాగజైన్.. సామ్ ఫొటోను పబ్లిష్ చేసింది. ఈ విషయాన్ని ఇన్ స్టాలో తెలిపింది. సమంత ఓ ప్రకృతి శక్తి.. ఏ మాయ చేశావేలో జెస్సీ పాత్ర నుంచి సిటాడెల్ సిరీస్ లో ఆమె రోల్ వరకు సమంత జర్నీ దేశంలోని మహిళలకు స్ఫూర్తినిస్తుందంటా ఫెమినా ఇండియా సుదీర్ఘమైన ట్వీట్ చేసింది.

 

ఇక సామ్ చివరగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఖుషిలో అలరించింది. మహానటి మూవీ తర్వాత వీరిద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. గతేడాది సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. మరోవైపు, సమంత సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు సమచారం అందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు జోడీ సమంత హీరోయిన్ గా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

సమంత తన స్నేహితురాలు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రాహుల్ తో సామ్ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్.. నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్ లో ది గర్ల్ ఫ్రెండ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. మరి సమంత కొత్త మూవీ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

 

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Actress 
  • Samantha 
  • Actresssamantha 
  • Femina 
  • Magazine 
  • Stunninglooks 
  • Fashionsense 
  • Filmindustry 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS