స‌మంత ఒక్క‌రోజు కూడా వ‌దిలి ఉండ‌లేద‌ట‌!

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి స‌మంత న‌టించిన ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా `ఖుషి`.;

Update: 2026-04-09 12:30 GMT

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి స‌మంత న‌టించిన ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా `ఖుషి`. ఈ మూవీ త‌రువాత వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల కార‌ణంగా కాస్త బ్రేక్ తీసుకున్న స‌మంత ప్రొడ్యూస‌ర్‌గా, న‌టిగా మ‌ళ్లీ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టింది. నాగ‌చైత‌న్య‌తో విడాకుల అనంత‌రం కొంత మాన‌సిక ఒత్తిడికి గురైన స‌మంతా ఆ త‌రువాత `ది ఫ్యామిలీ మ్యాన్‌` సిరీస్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన రాజ్ నిడియోరుని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న స‌హ‌కారంతో నిర్మాణ సంస్థ‌ని స్థాపించి చిన్న సినిమాల‌కు నిర్మాత‌గా స‌మంత శ్రీ‌కారం చుట్టింది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ 1న ద‌ర్శ‌కుడు రాజ్ నిడిమోరుని వివాహం చేసుక‌న్న సామ్ కొత్త లైవ్‌ని ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలోనే భ‌ర్త రాజ్ నిడిమోరుపై త‌న ప్రేమ‌ని వ్య‌క్తం చేసిన స‌మంత తాజాగా ఆస‌క్తిక‌రంగా స్పందించింది. రాజ్‌తో భావోద్వేగ భ‌ద్ర‌త‌ను, న‌మ్మ‌కాన్ని పొందాన‌ని వెల్ల‌డించింది. అంతే కాకుండా తాజాగా మ‌రింత ఆస‌క్తిక‌రంగా స్పందించి ఆశ్య‌ర్య‌ప‌రుస్తోంది. నా జీవితంలో ఇన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగిన త‌రువాత కూడా నేను ఒక మంచి మ‌నిషిగా, ఒక ఉత్త‌మ న‌టిగా ఎద‌గ‌డానికి కార‌ణం నా భ‌ర్త రాజే` అంటూ స్ప‌ష్టం చేసింది.

మేము ప్ర‌తి ప‌నిని క‌లిసే చేస్తాము. ప‌ని, వినోదం, వ్యాయామం కూడా. ఒక్క రోజు కూడా నేను అత‌నికి దూరంగా ఉండ‌లేను` అంటూ ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌రమైన ఎదుగుద‌ల‌కు త‌న జీవిత‌ భాగ‌స్వామి ఏ స్థాయిలో కీల‌క పాత్ర పోషించారో వివ‌రిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది స‌మంత‌. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇదిలా ఉంటే `శుభం`లో చిన్న అతిథి పాత్ర లో మెరిసిన స‌మంత పూర్తి స్థాయి క్యారెక్ట‌ర్‌లో సోలో మూవీతో మూడేళ్ల విరామం త‌రువాత ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఆమె న‌టించిన తాజా ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామా `మా ఇంటి బంగారం`. రాజ్ నిడియోరు షో ర‌న్న‌ర్‌గా, స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ మూవీకి నందిని రెడ్డి ద‌ర్శ‌కురాలు. ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మే 15న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. గుల్స‌న్ దేవ‌య్య‌, దిగాంత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Tags:    

Similar News