సమంత - రాజ్ పెళ్లి వెనుక ఈమె హస్తం కూడా ఉందా?

అయితే పెళ్లి అయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని వేరుపడిన ఈమె.. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.;

Update: 2026-01-06 08:26 GMT

టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది సమంత. సేల్స్ గర్ల్ గా కెరియర్ మొదలుపెట్టిన సమంత.. ఆ తర్వాత కోలీవుడ్లో తన నటన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. తెలుగులో ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈమె.. వరుసగా మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని వేరుపడిన ఈమె.. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.



 


ముఖ్యంగా సమంత ఇంకొకరితో రిలేషన్ లో ఉండడం వల్లే తన భర్తకు విడాకులు ఇచ్చింది అనే రూమర్స్ కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా ఈమె యాంటీ ఫ్యాన్స్ ఈమెను టార్గెట్గా చేసుకొని ఎన్ని విమర్శలు గుప్పించారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు నాగచైతన్యతో పెళ్లయిన తర్వాత సమంత బాలీవుడ్ లో తొలిసారి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ సమయంలోనే రాజ్ - సమంత మధ్య పరిచయం ఏర్పడింది. అయితే ఈ పరిచయం కారణంగానే తన భర్తకు విడాకులు ఇచ్చింది అనే వార్తలు కూడా మోసింది సమంత.

ఇక విడాకుల తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సమంత.. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది

మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే ఆ తర్వాత కాలంలో రాజ్ తో కలిసి సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చిన ఈమె.. దీంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత రాజ్ తో కలిసి చట్టపట్టాలేసుకొని తిరిగింది. దీంతో ఇక పెళ్లి చేసుకుంటారని అందరూ కామెంట్లు చేయగా.. ఈ రూమర్స్ పై స్పందించలేదు. కానీ ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్ ఒకటిన రాజ్ ను వివాహం చేసుకొని పుకార్లకు చెక్ పెట్టింది.

అయితే వీరి పెళ్లి జరగడానికి ఒక స్టార్ హీరోయిన్ కూడా కారణమని తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా సమంత సోషల్ మీడియా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో తన భర్త రాజ్ తో పాటు ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో సమంత రాజ్ ల పెళ్లికి తమన్నా కూడా కారణం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ తమన్నా వీరిద్దరితో కలిసి కనిపించేసరికి ఇవే రూమర్లు తెరపై వినిపిస్తున్నాయి. మరి దీనిపై సమంత లేదా తమన్నా ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Tags:    

Similar News