సమంత పెళ్లి.. అసలు సీక్రెట్ ఇదేనా?
ఆ పాత ఫొటో చూస్తుంటే వీరి నిశ్చితార్థం ఇప్పటిది కాదని, ఎప్పుడో జరిగిపోయిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు.;
పెద్దగా హడావుడి లేకుండా సమంత, రాజ్ నిడమూరు పెళ్లిపై హఠాత్తుగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1న పెళ్లిపై అఫీషియల్ క్లారిటీ ఇస్తూ కొన్ని ఫొటోలు వదిలారు. గతంలో ఎన్నో రకాల రూమర్స్ వైరల్ అయినా ఏనాడు వాటిపై క్లారిటీ అయితే ఇచ్చింది లేదు. ఇక వీరిద్దరూ రీసెంట్ గానే పెళ్లిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ అసలు కథ వేరే ఉందట. సోషల్ మీడియాలో బయటపడిన ఒక పాత ఫోటో ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది.
ఆ పాత ఫొటో చూస్తుంటే వీరి నిశ్చితార్థం ఇప్పటిది కాదని, ఎప్పుడో జరిగిపోయిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. సెలబ్రిటీల లైఫ్ లో చిన్న డీటెయిల్ ను కూడా ఫ్యాన్స్ వదలరు. ఇప్పుడు సమంత పెళ్లి ఫోటోలను జూమ్ చేసి మరీ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. పెళ్లిలో సమంత వేలికి ఉన్న ఉంగరం, గతంలో ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటోలో కూడా కనిపిస్తోంది. దీంతో ఈ పెళ్లి హఠాత్తుగా జరిగింది కాదని, దీని వెనుక చాలా కాలం నుంచి ప్లానింగ్ ఉందని అర్థమవుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 13న, అంటే వాలెంటైన్స్ డేకి సరిగ్గా ఒక రోజు ముందు సమంత ఒక ఫోటో షేర్ చేశారు. పింక్ కలర్ డ్రెస్ లో నవ్వుతూ ఉన్న ఆ ఫోటోలో ఆమె చేతికి ఒక భారీ డైమండ్ రింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు పెళ్లి ఫోటోల్లో ఉన్న ఉంగరం, అప్పుడు ఆమె వేలికి ఉన్న ఉంగరం ఒక్కటే అని నెటిజన్లు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే, వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫిబ్రవరిలోనే జరిగిపోయి ఉంటుందని బలమైన సందేహాలు కలుగుతున్నాయి.
దాదాపు పది నెలల క్రితమే ఉంగరాలు మార్చుకుని, ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారనే కామెంట్స్ వస్తున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగానే ఈ ఎంగేజ్మెంట్ జరిగి ఉంటుందని, అందుకే ఆ తర్వాత రోజు ఆమె ఆ ఫోటో పెట్టిందని ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు. సమంత మొదటి నుంచి ఈ రిలేషన్ విషయంలో చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు.
ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవ్వడంతో, ఇన్నాళ్లు ఇంత పెద్ద విషయాన్ని హడావుడి చేయకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. మొత్తానికి డిసెంబర్ లో పెళ్లి జరిగినట్లు బయటకు వచ్చినా, వారి బంధం మాత్రం ఎప్పుడో బలపడిందని ఈ ఉంగరం సాక్ష్యం చెబుతోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయేలా సమంత మెయింటైన్ చేసిన ఈ సీక్రెసీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా, చాలా కాలం తర్వాత సమంత మొహంలో ఆ నవ్వు చూడటం ఫ్యాన్స్ కు సంతోషాన్నిస్తోంది.