సామ్ రాజ్.. ఆ హగ్ వెనుక మ్యాటర్ ఏంటి?

సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు.. వీళ్ల మధ్య ఏం నడుస్తోందనే ప్రశ్న చాలా కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-11-07 17:36 GMT

సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు.. వీళ్ల మధ్య ఏం నడుస్తోందనే ప్రశ్న చాలా కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. 'ది ఫ్యామిలీ మ్యాన్' నుంచి మొదలైన ఈ ఫ్రెండ్‌షిప్, 'సిటాడెల్' టైమ్‌కి "సంథింగ్ స్పెషల్"గా మారిందా? అని ఫ్యాన్స్, నెటిజన్లు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఫైనల్ గా ఈ గాసిప్స్‌కు, ఈ సస్పెన్స్‌కు సామ్ ఒక్క ఫోటోతో చెక్ పెట్టినట్టే కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు.




రీసెంట్‌గా సమంత తన కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఆ ఈవెంట్‌లో సామ్ లుక్ అదిరిపోయింది. లేస్ బ్రాలెట్, హై వెయిస్ట్ ప్యాంట్స్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపించింది. ఈ లాంచ్‌కు సంబంధించిన చాలా ఫోటోలను ఆమె షేర్ చేసింది. కానీ, అందులోని ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైల్డ్‌ఫైర్ లాగా పాకింది.

ఆ ఫోటోలో సామ్, డైరెక్టర్ రాజ్ నిడిమోరు చాలా క్లోజ్‌గా ఉన్నారు. రాజ్‌ను సమంత గట్టిగా హగ్ చేసుకుని ఉంది. ఇద్దరూ కూడా ప్రపంచాన్ని మర్చిపోయినంత హ్యాపీగా నవ్వుతున్నారు. ఆ ఫోటోలోని వైబ్ చూస్తే, ఇది జస్ట్ "ఫ్రెండ్స్" ఫోటో అని కొట్టిపారేయడం కష్టమే అనే కామెంట్స్ వస్తున్నాయి.

రాజ్ తన చేతిని సామ్ నడుముపై వేసి ఉండటం, సామ్ అంత కంఫర్టబుల్‌గా అతనికి క్లోజ్‌గా ఉండటం చూస్తుంటే అఫీషియల్ గా ఏదో క్లారిటీ ఇవ్వనున్నట్లు మరికొందరు అంటున్నారు. కామెంట్ సెక్షన్ మొత్తం ఫైర్, హార్ట్ ఎమోజీలతో నిండిపోయింది. "ఫైనల్లీ! కన్ఫర్మ్ చేశారు అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

నిజానికి, 'సిటాడెల్: హనీ బన్నీ' టైమ్ నుంచే వీళ్లు కలిసి తిరగడం, పార్టీల్లో కనిపించడం కామన్ అయింది. సామ్ పోస్టుల్లో కూడా రాజ్ అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాడు. కానీ, ఎప్పుడూ ఇంత ఓపెన్‌గా, ఇంత క్లోజ్‌గా ఉన్న ఫోటో బయటకు రాలేదు. ఇది కచ్చితంగా వీళ్ల రిలేషన్‌షిప్‌కు సాఫ్ట్ కన్ఫర్మేషన్ అని ఫాలోవర్స్ ఫిక్స్ అవుతున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఇద్దరూ అఫీషియల్‌గా ఏమీ చెప్పకపోయినా, ఈ ఒక్క ఫోటో వెయ్యి మాటలకు సమాధానం చెప్పేసింది. ప్రస్తుతం వీరిద్దరూ 'రక్త్ బ్రహ్మాండ్', 'మా ఇంటి బంగారం' వంటి ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నరు. ఇక నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News