ఒకే కారులో సామ్, రాజ్.. ఇంకెప్పుడు సారూ!

స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ షిప్ లో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-07-31 11:07 GMT

స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ షిప్ లో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా.. జరుగుతున్న పరిణామాల ఆధారంగా వారి రిలేషన్ షిప్ ను అంత కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి ఇద్దరూ వార్తల్లో నిలిచారు.

ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌ లతో సామ్.. ఓ రేంజ్ లో అలరించిన సంగతి విదితమే. ఆ సిరీసుల దర్శకుడు రాజ్ నిడిమోరు కాగా.. షూటింగ్ ల సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా.. సామ్ ఎక్కడుంటే రాజ్ అక్కడే కనిపిస్తున్నారు. ఇద్దరూ సాన్నిహిత్యంగా మెలుగుతున్నారని చెప్పాలి. దీంతో వారి మధ్య ఏదో ఉందని అంతా డిసైడ్ అయిపోయారు. రీసెంట్ గా నిర్మాతగా డెబ్యూ మూవీ శుభం రూపొందించిన సమయంలో సామ్ తోనే రాజ్ కనిపించారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు సమంతతోనే ఉన్నారు.

ఇటీవల అమెరికా కూడా కలిసి వెళ్లారు. సామ్ భుజంపై రాజ్ చేతులు వేసి నడుస్తున్న పిక్ వైరల్ గా మారింది. ఆ తర్వాత మరో ఫొటోలో చాలా క్లోజ్ గా కనిపించారు. డెట్రాయిట్ వీధుల్లో కలిసి చక్కర్లు కొట్టారు. మొత్తానికి వరుసగా కలిసి తిరుగుతుండడం.. కలిసి కనిపిస్తుండటం.. వారి రిలేషన్ షిప్ వార్తలకు బలం చేకూరుతూనే ఉంది.

ఇప్పుడు ఒకే కారులో కనిపించారు రాజ్, సామ్. ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో క్యాజువల్‌ వైట్‌ డ్రెస్‌ లో సమంత నవ్వుతూ కనిపించారు. రాజ్ సింపుల్ డ్రెస్ లో ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోస్, పిక్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నాట్లు ఆల్మోస్ట్ గా చెప్పేశారని కామెంట్లు పెడుతున్నారు. త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నారని అంచనా వేస్తున్నారు. అయితే రాజ్ కు ఇప్పటికే వివాహం అయింది. భార్య, కుమార్తెలు ఉన్నారు. అయితే రాజ్ సతీమణి కూడా కొన్ని రోజులుగా వివిధ అంశాలపై పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News