సమంత తల్లి కాబోతుందా? టాలీవుడ్‌లో షాకింగ్ బజ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ హెడ్‌లైన్స్‌లోకి వచ్చారు. ఈసారి ఆమె ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ హెడ్‌లైన్స్‌లోకి వచ్చారు. ఈసారి ఆమె ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సమంత తొందరలోనే తల్లి కాబోతోందంటూ గత రెండు రోజులుగా నెట్టింట విపరీతంగా ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ గాసిప్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారగా, దీనిపై నిజానిజాలు ఏంటనే సస్పెన్స్ అభిమానుల్లో మరింతగా పెరిగిపోతోంది. దీనికి సంబందించిన ఓ వీడియో నెట్ లో సందడి చేస్తుంది..ఆ విశేషాలు చూద్దాం..
‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో బేబీ బంప్?:
సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో, తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్‌లో సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో వైట్ టీషర్ట్ ధరించిన సమంత, కొద్దిగా ‘బేబీ బంప్’తో కనిపించారంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజా సక్సెస్ మీట్ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అంటూ గట్టిగా ఫిక్స్ అయిపోయి పోస్టులు పెడుతున్నారు.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు:
ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై అటు సమంత కానీ, ఇటు ఆమె భర్త రాజ్ నిడిమోరు కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అలాగే ఈ రూమర్లను ఖండించనూ లేదు. దీంతో ఈ విషయంపై క్లారిటీ రావాలంటే సమంత స్వయంగా స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మరోవైపు, ఆమె నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి, సమంత కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనర్లలో ఒకటిగా నిలిచింది. ఇక ఒకే రోజులోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ స్టేటస్ అందుకోవడం విశేషం.
ఒకవైపు నిర్మాతగా, నటిగా తాను చేసిన 'మా ఇంటి బంగారం' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కావడం.. మరోవైపు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందనే టాక్ నడవడంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో సమంత పేరే మారుమోగిపోతోంది. ఇక ఈ ప్రెగ్నెన్సీ వార్త నిజం కావాలని, తమ లక్కీ హీరోయిన్ త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందాలని సామ్ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.