హమ్మయ్య.. మా ఇంటి బంగారం రాబోతోంది.. షూటింగ్ అప్పుడే!
అయితే అలాంటి సమంత తాజాగా తన కొత్త సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వడంతో సమంత అభిమానుల్లో సరికొత్త ఆశలు రేకెత్తాయి.;
అందాల నటి సమంత ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంత బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేసేదో చెప్పనక్కర్లేదు. ఒకే నెలలో రెండు మూడు సినిమా షూటింగ్లు కూడా చేసేది.అలాంటిది ఇప్పుడు ఆమె చేతిలో అసలు ఒక్క సినిమా కూడా ఉండడం లేదు. సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఏదో ఒక సినిమాతో అలా పలకరించి ఇలా వెళ్ళిపోతోందే తప్ప అభిమానులు ఆశించినంతగా ఆమె పర్ఫామెన్స్ ఉండడం లేదు. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ ప్రభావం ప్రొఫెషనల్ కెరియర్ పై పడుతోంది. అయితే అలాంటి సమంత తాజాగా తన కొత్త సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వడంతో సమంత అభిమానుల్లో సరికొత్త ఆశలు రేకెత్తాయి. మరి ఇంతకీ సమంతకి సంబంధించిన ఆ కొత్త సినిమా అప్డేట్ ఏంటి అనేది చూస్తే..
చాలా మంది సెలబ్రిటీలు తమ అభిమానులతో కలిసి అప్పుడప్పుడు సోషల్ మీడియా చిట్ చాట్ లో పాల్గొంటూ ఉంటారు. అలా పాల్గొన్న సమయంలో ఎంతోమంది అభిమానులు తమ అభిమాన హీరోయిన్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకుంటారు. ప్రొఫెషనల్ , పర్సనల్ ఇలా తమకు డౌట్ ఉన్న ప్రతి విషయంలో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ చిట్ చాట్ లో పాల్గొన్న సమంత తన అభిమానులకి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. మీ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు? అని ఓ నెటిజన్ అడగగా.. దానికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. తన నెక్స్ట్ టాలీవుడ్ ఫిల్మ్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతుంది అంటూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది.
ఈ ఆన్సర్ విన్న ఫ్యాన్స్ ఆనందోత్సాహంలో మునిగిపోయారు. ఎందుకంటే సమంత తన సొంత బ్యానర్లో 'మా ఇంటి బంగారం' అనే సినిమాని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ స్వయంగా సమంతనే ఇవ్వడంతో ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
సమంత మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. సమంత సొంత బ్యానర్ అయినటువంటి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాలో సమంతకి సంబంధించిన ఓ పోస్టర్ కూడా ఆ మధ్యకాలంలో విడుదలైంది. అందులో సమంత తుపాకీని పట్టుకొని రక్తం చిమ్మిన ఫేస్ తో భయంకరమైన లుక్ లో పోస్టర్ రివీల్ చేశారు. సమంత చివరిగా తాను నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం మూవీ లో గెస్ట్ రోల్ పోషించింది. మరోవైపు బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.