సామ్ 'బంగారం'.. రజినీ మూవీతో లింక్ ఏంటి?

అయితే తాజాగా దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పిన ఓ విషయం ఆ సినిమాను మరింత హాట్ టాపిక్‌ గా మార్చింది.

Update: 2026-06-12 06:37 GMT

స్టార్ హీరోయిన్ సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. జబర్దస్త్, ఓ బేబీ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడో మూవీ మా ఇంటి బంగారం. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పిన ఓ విషయం ఆ సినిమాను మరింత హాట్ టాపిక్‌ గా మార్చింది.

మా ఇంటి బంగారంలో సమంత పోషించిన రోల్ ను కోలీవుడ్ సూపర్‌ స్టార్ రజినీకాంత్ కెరీర్‌ లో సంచలన విజయాన్ని అందుకున్న బాషా సినిమా టెంప్లేట్‌ లో రూపొందించినట్లు నందిని రెడ్డి వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా ఆ సినిమాపై చర్చ మొదలైంది. అయితే ఇది కేవలం మాస్ యాక్షన్ పాత్ర మాత్రమే కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

బాషాలో కనిపించినట్టు ఫ్యామిలీకి అండగా నిలిచే ధైర్యం, అవసరమైనప్పుడు పోరాడే తెగువ, తనలో దాచుకున్న మరో యాంగిల్ పాత్రలో ఉంటాయని పరోక్షంగా చెప్పారు. అంతేకాదు, సమంత పాత్రలో ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని తెలిపారు. బయటకు ధైర్యంగా కనిపించే ఆ పాత్రలో బాధ, ప్రేమ అన్నీ కూడా కనిపిస్తాయని చెప్పారు. అందుకే ఇది సమంత కెరీర్‌ లో అత్యంత వైవిధ్యమైన పాత్రల్లో ఒకటిగా నిలుస్తుందని వినికిడి.

అయితే 1995లో విడుదలైన బాషా చిత్రం రజినీకాంత్ స్టార్‌ డమ్‌ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సాధారణ ఆటో డ్రైవర్‌ గా కనిపించే వ్యక్తి వెనుక ఉన్న పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్, కుటుంబం కోసం అతను చేసిన త్యాగం, అవసరమైనప్పుడు బయటపడే మాస్ అవతార్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఆ సినిమా డైలాగ్స్, సీన్స్ అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. అలాంటి చిత్రాన్ని గుర్తు చేసేలా సమంత పాత్ర ఉంటుందని నందిని రెడ్డి చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఇక మా ఇంటి బంగారం చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్‌ పై నిర్మించారు. రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి నిర్మాతగా వ్యవహరించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది.

ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఆ చిత్రం ప్రేక్షకులు పెట్టే మనీకి, టైమ్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుందని మూవీ టీమ్ చెబుతోంది. ఇప్పటికే సమంత చీరకట్టులో చేసిన యాక్షన్ సీన్స్ పై ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడు బాషా కంపేరిజన్ కూడా యాడ్ కావడంతో మా ఇంటి బంగారం మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి సినిమాలో సమంత ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలియాలంటే జూన్ 19వ తేదీ వరకు ఎదురుచూడాల్సిందే.

Tags:    

Similar News