100 కోట్ల మార్క్.. వాళ్ళ కష్టాన్ని గుర్తించిన సామ్
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిందని నిర్మాణ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
తెలుగు బాక్సాఫీస్ దగ్గర లేడీ ఓరియెంటెడ్ సినిమాల కలెక్షన్స్ ఈమధ్య మళ్ళీ తగ్గాయని ఒక టాక్ వచ్చింది. స్టార్ హీరోల రేంజ్ వసూళ్లు రాబట్టడం కష్టమనే ఫీల్ మళ్ళీ వైరల్ అయ్యింది. కానీ ఆ పాత లెక్కలన్నింటినీ మారుస్తూ 'మా ఇంటి బంగారం' సాలిడ్ నంబర్స్ రాబట్టినట్లు.తెలుస్తోంది. కలెక్షన్స్ విషయంలో మేకర్స్ అధికారికంగా ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిందని నిర్మాణ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
టాలీవుడ్ చరిత్రలోనే వంద కోట్లు కొట్టిన తొలి ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఇదేనని ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ వాళ్లు క్లారిటీ ఇచ్చారు. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. సినిమా కోసం తెరవెనుక కష్టపడిన వారిని ఒకచోట చేర్చి ఈ సెలబ్రేషన్స్ లో స్పెషల్ గా సత్కరించారు.
ముఖ్యంగా సమంత స్వయంగా టెక్నీషియన్ల కష్టాన్ని గుర్తించడం ఇక్కడ హైలైట్ గా నిలిచింది. నిర్మాతలు సమంత, రాజ్ నిడిమోరు టీమ్ సభ్యులకు ఈవెంట్ లో షీల్డ్స్ అందజేశారు. కేవలం జ్ఞాపికలతోనే సరిపెట్టకుండా, సినిమా కోసం రాత్రింబవళ్లు పనిచేసిన వారి కష్టానికి ప్రతిఫలంగా క్యాష్ ప్రైజులు, కార్లు, బంగారు నాణేలను కూడా కానుకలుగా ఇచ్చి నిర్మాతలు తమ ఉదారత చాటుకున్నారు. క్రూ మెంబర్స్ తో కలిసి వాళ్లు ఆనందాన్ని పంచుకున్నారు.
ఒక సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వాలంటే తెర వెనుక ఎంతోమంది కృషి కచ్చితంగా ఉంటుంది. అందుకే ఆ సమిష్టి కష్టాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ స్పెషల్ రివార్డ్స్ అందించారు. సమంత లీడ్ రోల్ కు తోడుగా గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి, ఆనంద్ లాంటి వాళ్లు తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేయడం సినిమాకు పెద్ద ప్లస్ అయిందని మేకర్స్ ఈ సందర్భంగా సంతోషంగా చెప్పుకొచ్చారు.
రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన ఈ కథను డైరెక్టర్ నందిని రెడ్డి చాలా కన్విన్సింగ్ గా తెరకెక్కించారు. ఒక సాధారణ ఫ్యామిలీ పాయింట్ ని అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేయడంలో ఆమె పూర్తిగా సక్సెస్ అయ్యారు. రాజ్, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. వీళ్లందరి టీమ్ వర్క్ వల్లే బాక్సాఫీస్ దగ్గర ఈ నంబర్స్ సాధించడం సాధ్యమైందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. 'మా ఇంటి బంగారం' టీమ్ అఫీషియల్ గా ఇచ్చిన ఈ వంద కోట్ల అనౌన్స్ మెంట్ భవిష్యత్తులో వచ్చే మరిన్ని ఫిమేల్ సెంట్రిక్ కథలకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. కంటెంట్ లో దమ్ముంటే జనాలు థియేటర్లకు కచ్చితంగా వస్తారని ఈ యూనిట్ చెబుతోంది.