సామ్ కంప్లీట్ ఫోకస్ 'బంగారం' పైనేనా?

ఇప్పటికే ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్.. సినీ ప్రియులను మెప్పించాయి. ఆడియన్స్ లో మూవీపై సూపర్ బజ్ కూడా క్రియేట్ చేశాయి.;

Update: 2026-03-05 05:13 GMT

స్టార్ హీరోయిన్ సమంత.. గ్యాప్ తర్వాత ఇప్పుడు సోలో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న ఆమె.. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్ బ్యానర్ పై సమంత నిర్మిస్తున్నారు. ఆమె భర్త కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్.. సినీ ప్రియులను మెప్పించాయి. ఆడియన్స్ లో మూవీపై సూపర్ బజ్ కూడా క్రియేట్ చేశాయి. అయితే మే 15వ తేదీన సమ్మర్ కానుకగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ ఇప్పటికే మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో షూటింగ్ ను శరవేగంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి.. ప్రమోషన్స్ ను నిర్వహించాల్సి ఉంది. దీంతో మూవీ టీమ్ బాగా కష్టపడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సమంత.. తన ఫోకస్ అంతా మా ఇంటి బంగారం మూవీపైనే పెట్టినట్టు కనిపిస్తోంది. వరుస షెడ్యూల్స్ లో పాల్గొంటూ చిత్రీకరణ వేగంగా జరిగేలా కొపరేట్ చేస్తున్నారని వినికిడి.

నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుండడంతో.. సామ్ ఎక్కడా బయట కనిపించడం లేదు. రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ తో పాటు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న పెళ్లి వేడుకలకు రాలేదని వినికిడి. అంతే కాదు.. పెళ్లి అయ్యాక వచ్చిన ఫస్ట్ హోలీ పండుగ సెట్స్ లోనే జరుపుకున్నారు సమంత. వేరుగా సెలబ్రేట్ చేసుకునే టైమ్ లేక.. షూటింగ్ స్పాట్ లోనే అక్కడే జరుపుకున్నట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన వీడియో సమంత పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామ్.. తన భర్త రాజ్ పై, డైరెక్టర్ నందిని రెడ్డిపై ఫుల్ జోష్ లో రంగులు చల్లుతూ కనిపించారు. అంతే కాదు. సీక్రెట్ గా వెనుక నుంచి వచ్చిన సమంత.. రాజ్ పై రంగులు పూశారు. దీంతో క్యూట్ కపుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఆ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. మనుషుల మధ్య ఉన్న సంబంధాలు సున్నితంగా చూపించే కథతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే సమంత- నందిని రెడ్డి ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్‌ లో మూవీ తెరకెక్కుతుండడంతో ఆడియన్స్, అభిమానులు మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. మరి మా ఇంటి బంగారం మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.



Tags:    

Similar News