సామ్ అత్తగారి ఫ్యామిలీ.. లవ్లీ గ్రూప్ పిక్ చూశారా?

ఇప్పుడు సమంత అత్తగారి ఫ్యామిలీ గ్రూప్ పిక్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.;

Update: 2025-12-03 05:34 GMT

స్టార్ హీరోయిన్ సమంత.. రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో మంగళవారం ఉదయం ఆమె పెళ్లి జరగ్గా.. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ అందరినీ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు సమంత అత్తగారి ఫ్యామిలీ గ్రూప్ పిక్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. అందరినీ ఆకర్షిస్తోంది. ఆ పిక్ లో కొత్త జంటతోపాటు రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులు ఉన్నారు. వారంతా సమంతకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. డిసెంబర్ 1న వివాహం జరగ్గా.. నిన్న అంటే డిసెంబర్ 2న సామ్ తన అత్తింటికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఆ ఫోటోను రాజ్ నిడిమోరు సోదరి శీతల్.. నెట్టింట షేర్ చేశారు. ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చారు. నిడిమోరు ఫ్యామిలీలోకి సమంతను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు ఎప్పుడూ ఆమెకు తాను అండగా ఉంటానని వెల్లడించారు. ఏదేమైనా తనకు ఇప్పుడు ఆనందంతో ఎలాంటి మాటలు రావడం లేదని అన్నారు.

అపారమైన భక్తితో భక్తులు శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో ఇప్పుడు తాను కూడా అలాగే ఉన్నానని తెలిపారు. ముఖ్యంగా ఆనంద బాష్పాలతో హృదయం ఉప్పొంగుతోందని, ఇప్పుడు తన కుటుంబం ఫుల్ ఫిల్ అయిందని చెప్పారు. సమంత, రాజ్ ను చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

సమంత- రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకున్నారని, ఒకరిపై ఒకరికి గౌరవం ఉందని చెప్పారు. అయితే నిజాయతీతో రెండు హృదయాలు ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారి లైఫ్ అంతా ప్రశాంతతో నిండిపోతుందని తెలిపారు. అందుకే తామంతా కొత్త జంటకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాజ్ సోదరి శీతల్.

అయితే ఆడపడుచు పోస్టుకు సామ్ రిప్లై ఇచ్చారు. లవ్ యూ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. కాగా.. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ ఈశా యోగా సెంటర్‌ లోని లింగ భైరవి దేవాలయంలో సామ్, రాజ్ వివాహం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరు కాగా.. సమంత కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News