అఫీషియల్: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న సమంత - రాజ్ నిడిమోరు!

చలనచిత్ర పరిశ్రమలో ఇన్ని రోజులు రూమర్డ్ కపుల్స్ గా కొనసాగిన సమంత - రాజ్ నిడిమోరు ఎట్టకేలకు పెళ్లి బంధం లోకి అడుగుపెట్టారు.;

Update: 2025-12-01 08:49 GMT

చలనచిత్ర పరిశ్రమలో ఇన్ని రోజులు రూమర్డ్ కపుల్స్ గా కొనసాగిన సమంత - రాజ్ నిడిమోరు ఎట్టకేలకు పెళ్లి బంధం లోకి అడుగుపెట్టారు. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ దగ్గర ఉన్న లింగ బైరవి సన్నిధిలో ఈ జంట మూడు ముళ్ళు ఏడడుగులతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటిస్తూ.. తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులకు తెలియజేసింది. రెడ్ కలర్ చీరలో చాలా అందంగా ముస్తాబైన సమంత.. వైట్ అండ్ వైట్ పైజామాలో పైన గోల్డెన్ కలర్ జాకెట్ ధరించి మరింత అందంగా కనిపించారు రాజ్.

తాజాగా వీరిరువురు పూల దండలు మార్చుకున్న ఫోటోలు, ఉంగరాలు ధరించిన ఫోటోలు అలాగే రాజ్ చెయ్యి పట్టుకుని సమంత సంతోషంగా సన్నిధి నుండి బయటకు వస్తున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అంతేకాదు డిసెంబర్ 1 2025 అంటూ డేట్ ప్రకటిస్తూ.. క్యాప్షన్లో వైట్ కలర్ లవ్ సింబల్స్ జోడించింది. మొత్తానికి అయితే ఇన్ని రోజులు రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకున్న సమంత, రాజ్ నిడిమూరు ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సమంత - రాజ్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే వీరి వివాహానికి సుమారుగా 25 మంది సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో నందిని రెడ్డి తో పాటు సింగర్ చిన్మయి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. సమంత - రాజ్ నిడిమోరు విషయానికి వస్తే.. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్.. ఇందులో సమంత చాలా బోల్డ్ గా నటించి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ కారణంగానే సమంతకి తన మొదటి భర్త నాగచైతన్య విడాకులు ఇచ్చారనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి.

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ తర్వాత వీరిద్దరూ ఎక్కువగా కలిసి కనిపించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వెకేషన్ కి వెళ్ళినా .. యోగా సెంటర్ లో.. జిమ్ సెంటర్లో ఇలా ఎక్కడ చూసినా ఈ జంట కనిపించడం చూసి ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు. దీనికి తోడు రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దే కూడా వీరి రిలేషన్ కు సంబంధించి ఇన్ డైరెక్ట్ గా కొన్ని రకాల పోస్ట్లు పెడుతూ వచ్చింది. ఇక ఈరోజు ఉదయం కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న వేళ.. తెగించిన వాళ్లే ఇలాంటి పనులు చేయడానికి సిద్ధమవుతారు అంటూ శ్యామలీ పోస్ట్ పెట్టి మళ్ళీ అందరికి అనుమానాలు కలిగించింది. కానీ ఎట్టకేలకు ఈ జంట ఈరోజు పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం వీరి ఇరువురికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News