• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత 'పుష్ప' సాంగ్...

సమంత 'పుష్ప' సాంగ్ చేయకపోయి ఉంటే..

| ‘పుష్ప’ సాంగ్ ద్వారా సమంతకి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-11-08 06:14 GMT

ఫీమేల్ సెంట్రిక్ కథలతో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోన్న సమంత తాజాగా ‘సిటాడెల్: హాన్నీ బన్నీ’ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంట్లో సమంత పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. మరోసారి సమంత ఈ సిరీస్ తో నటిగా మంచి గుర్తింపు అందుకుంటోంది. ఇదిలా ఉంటే సమంత, నాగ చైతన్య 2021లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ సమయంలోనే ‘పుష్ప’ సినిమాలోని ఊ అంటావా సాంగ్ చేసే అవకాశం వచ్చింది. అయితే ఈ విడాకుల సమయంలో ఇలాంటి బోల్డ్ ఐటెం సాంగ్ లో నటించడం కరెక్ట్ కాదని సమంతకి చాలా మంది సన్నిహితులు సలహాలు ఇచ్చారంట. నిజానికి సమంత కూడా విడాకుల కారణంగా ఆ సమయంలో కొంత డిప్రెషన్ తో ఉంది. దీంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా సాంగ్ చేయొద్దని, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని సూచించారంట.

అయితే సమంత వారందరి మాటని కాదని ‘పుష్ప’ సినిమాలోని ఊ అంటావా సాంగ్ చేసింది. తరువాత ఈ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. సాంగ్ లో సమంత డాన్స్, పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు లభించాయి. ఈ సాంగ్ ఇప్పటికి దేశ వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట వినబడుతూనే ఉంటుంది. ‘పుష్ప’ సాంగ్ ద్వారా సమంతకి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత ‘పుష్ప’ సాంగ్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలని పంచుకుంది. అందులో భాగంగా ఈ సాంగ్ ఆఫర్ వచ్చినపుడు సన్నిహితులు అందరూ వద్దని చెప్పారని క్లారిటీ ఇచ్చింది. అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. వివాహ వ్యవస్థలో 100 శాతం నిజాయితీగా ఉన్నాను. అలాంటప్పుడు నేనెందుకు భయపడి ఇంట్లో దాక్కోవాలి అనిపించింది. అందుకే సాంగ్ చేయడానికి ఒకే చెప్పానని సమంత చెప్పుకొచ్చింది.

‘పుష్ప’ సాంగ్ గురించి సుకుమార్ చెప్పిన తర్వాత ముందుగా ఆలోచించిన తరువాత కచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యానని సమంత తెలిపింది. సమంత ఆ సాంగ్ లో చేయకపోయి ఉంటే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. అంతలా అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో సమంత ఆ సాంగ్ లో పెర్ఫార్మ్ చేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ సిద్ధమవుతోంది.

Tags:    
  • Samantha 
  • Pushpa 
  • Alluarjun 
  • Citadelhoneybunny 
  • Samanthacomments 
  • Divorce 
  • Sukumar 
  • Varundhawan 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS