సోషల్ మీడియా ట్రోల్స్ పై సమంత మండిపాటు.. బ్లాక్ లిస్టులో పెట్టేస్తానంటూ!
ప్రముఖ పాన్ ఇండియా హీరోయిన్ సమంత (Samantha). ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సినిమా లో లీడ్ రోల్ పోషించడమే కాకుండా ఆ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.;
ప్రముఖ పాన్ ఇండియా హీరోయిన్ సమంత (Samantha). ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సినిమా లో లీడ్ రోల్ పోషించడమే కాకుండా ఆ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించిన తర్వాత 'శుభం' సినిమా తీసి నిర్మాతగా సక్సెస్ అయిన ఈమె.. ఇప్పుడు తన నిర్మాణంలోనే 'మా ఇంటి బంగారం' సినిమా చేస్తోంది. ఇకపోతే నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పైగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఇది మూడవ సినిమా కావడం గమనార్హం. ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా కీలకపాత్ర పోషిస్తుంది.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 22న ఆదివారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ సమంత ఒక పోస్టర్ వదిలిన విషయం అందరికీ తెలిసిందే. మే 15వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలను నెగిటివ్ చేయాలని చూస్తే అసలు ఊరుకోనని చెప్పిన ఈమె.. అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెట్టేస్తాను అంటూ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.
అందులో భాగంగానే సమంత మాట్లాడుతూ.." ఇలాంటి విమర్శలు, ప్రశంసలు నన్ను ఏమాత్రం ప్రభావితం చేయవు. కానీ ఎవరైనా సరే నా వ్యక్తిగత విషయంలోకి నెగెటివిటీని తీసుకొస్తే మాత్రం బ్లాక్ లిస్టులో పెట్టేస్తాను. బ్లాక్ చేయడం అంటే నేను బాధపడడం కాదు అలాంటి వారిని నా దగ్గరకు కూడా రానివ్వను" అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది సమంత. మొత్తానికైతే తన జోలికి ఎవరైనా వస్తే ఇక అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టేస్తానని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఇదే సంభాషణలో భాగంగా ఒత్తిడిని జయించడానికి తాను ఏమేం చేస్తానో అనే విషయంపై మాట్లాడుతూ.." సినిమాల ఒత్తిడి నాపై ఎక్కువగా ఉంటుంది. వాటిని జయించేందుకు నిత్యం ధ్యానం చేస్తాను. సరదాగా ఉన్నప్పుడు కిందపడి మరీ నవ్వుతాను" అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది సమంత. మొత్తానికి అయితే సమంత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక వ్యక్తిగత విమర్శల కారణానికి వస్తే.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట వివాహమైన నాలుగేళ్లకే విడిపోయారు. ఆ సమయంలో సమంత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. దీనికి తోడు గత ఏడాది ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో చట్టా పట్టాలేసుకొని తిరిగింది. ఇక పెళ్లి చేసుకుంటారు అని వార్తలు రాగా.. అందుకు తగ్గట్టుగానే గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇకపోతే అప్పటినుంచి ఈమెపై మరిన్ని విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే అటు విమర్శలకు.. తన వ్యక్తిగత జీవితంలోకి వచ్చే నెగెటివిటీని పారుద్రోలే క్రమంలో సమంత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.