సమంతతో 200 కోట్ల ఎక్స్ పెరిమెంట్..?
తెలుగులో స్టార్ అయిన సమంత అటు తమిళ్ లో కూడా అదే రేంజ్ ఫాం కొనసాగించింది. అక్కడ కూడా స్టార్స్ తో కలిసి జత కట్టి సత్తా చాటింది సమంత.;
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈమధ్యనే తన 15 ఏళ్ల సినీ వసంతాలను పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల జర్నీలో సమంత ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా వచ్చి అలా కనుమరుగయ్యే హీరోయిన్స్ ఉన్న ఈ టైం లో ఏమాయ చేసావే సినిమాతో పరిచయమై తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది అమ్మడు. కెరీర్ లో స్టార్ క్రేజ్ ని త్వరగానే అందుకుంది సమంత. తొలి సినిమా హిట్ ఆ తర్వాత రాజమౌళి దృష్టిలో పడి ఈగ ఛాన్స్ రావడం. అది కూడా సూపర్ హిట్ అవ్వడం మహేష్, ఎన్ టీ ఆర్ ఇలా స్టార్స్ తో నటించడంతో అమ్మడి రేంజ్ మరింత పెరిగింది.
కెరీర్ లో కొంత బ్యాడ్ టైం..
తెలుగులో స్టార్ అయిన సమంత అటు తమిళ్ లో కూడా అదే రేంజ్ ఫాం కొనసాగించింది. అక్కడ కూడా స్టార్స్ తో కలిసి జత కట్టి సత్తా చాటింది సమంత. ఐతే ప్రతి హీరోయిన్ కి కెరీర్ లో కొంత బ్యాడ్ టైం నడుస్తుంది. ఆ టైం ని కూడా చాలా సమర్ధవంతంగా ఫేస్ చేసింది సమంత. ఇక పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో ఇబ్బందులు ఆమెను మరింత వెనక్కి నెట్టాయి.
మయోసైటిస్ వల్ల సమంత దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన సమంత ఆ తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు. ఐతే ఆఫ్టర్ లాంగ్ టైం సమంత శుభం సినిమాలో క్యామియో రోల్ చేసింది. ఐతే అది కూడా తన సొంత ప్రొడక్షన్ లో సినిమా కాబట్టే ఆ మూవీలో నటించింది. సమంత ఎప్పుడు వెనకపడ్డా కూడా దానికి డబుల్ ఫోర్స్ తో మళ్లీ ముందుకొస్తుంది.
సమంత లీడ్ రోల్ లో రక్త్ బ్రహ్మాండ్..
ఈమధ్యనే సిటాడెల్ సీరీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించిన సమంత. నెక్స్ట్ రాజ్ అండ్ డీకే చేస్తున్న 200 కోట్ల ప్రాజెక్ట్ లో నటిస్తుందని తెలుస్తుంది. రాజ్ అండ్ డీకే తో సమంత కాంబినేషన్ లో ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సీరీస్ లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ దర్శక ద్వయం నెక్స్ట్ రక్త్ బ్రహ్మాండ్ అంటూ ఒక సీరీస్ ని చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ 200 కోట్ల బడ్జెట్ తో భారీగా ఉండబోతుందట. ఇందులో సమంత లీడ్ రోల్ లో నటిస్తుంది. సమంతతో అంత బడ్జెట్ తో సీరీస్ అంటే రిస్క్ అనే చెప్పొచ్చు. కానీ సబ్జెక్ట్ మీద ఉన్న కాన్ ఫిడెన్స్ తో ముందుకెళ్తున్నారట. త్వరలోనే ఈ సీరీస్ కు సంబందించిన అప్డేట్ బయటకు వస్తుంది.
సమంత తెలుగు సినిమాలు చేయకపోవడంతో ఆమె తెలుగు ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉన్నా కూడా అమ్మడు బాలీవుడ్ లో చేస్తున్న సినిమాల పట్ల సంతృప్తిగా ఉన్నారు.