సల్మాన్ ఖాన్ జోక్ అమీర్ ఖాన్ విడాకుల గురించేనా!
అమీర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్ ను గురువారం సాయంత్రం ముంబైలో వేసారు.;
అమీర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్ ను గురువారం సాయంత్రం ముంబైలో వేసారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు పాల్గొ న్నారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రేఖ, విక్కీ కౌశల్ పాల్గొన్నారు. ఇదే వేడుకలో అమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తో హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అక్కడ ఎంత మంది తారలున్నా? కళ్లన్నీ ఈ జంటపైనా పడ్డాయి. దీంతో ఫోటో గ్రాఫర్లు గ్యాప్ లేకుండా క్లిక్ మనిపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గానూ మారాయి. ఈ సందర్భంగా స్నేహితుడు అమీర్ ఖాన్ పై సల్మాన్ ఖాన్ జోకులు వేసాడు. ముందుగా ఈ సినిమా తాను చేయాల్సిందని కానీ మధ్యలో అమీర్ ఖాన్ దూరి తనని పక్కకు నెట్టేసాడు అన్నారు. ముందుగా మా ఇంటికొచ్చి ఈ కథ నాకే చెప్పాడు.
నాకెంతో నచ్చింది. చేస్తాను అని చెప్పాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి నేనే చేస్తాను ఈ సినిమా అన్నాడు. అందుకు సంతోషించి తన నిర్ణయాన్ని మెచ్చుకున్నా` అన్నారు. అనంతరం అమీర్-కిరాణ్ రావ్ విడాకులపై ఓ ఇంట్రెస్టింగ్ జోకు వేసాడు సల్మాన్ ఖాన్. అమీర్ నాకు ఈ కథ గురించి చెప్పినప్పుడే ఈసి నిమా అప్పుడే చేయాలి. కానీ ఆ సమయంలో వేరే పేపర్ వర్క్ లో బిజీగా ఉన్నాడన్నారు.
సల్మాన్ వ్యాఖ్యలతో అక్కడున్న వారంత గల్లున నవ్వారు. ఆ వ్యాఖ్యలు పరోక్షంగా అన్నా అక్కడ ఉన్న జనాలందరికీ మ్యాటర్ అర్దమవ్వడంతో పగలబడి నవ్వారు. సల్మాన్ ఖాన్-అమీర్ ఖాన్ మంచి స్నేహితులు. ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం..గౌరవంగా ఉంటారు.