జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బయోపిక్?
తాజా సమచారం మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందుతోందని ప్రచారం సాగుతోంది.;
బయోపిక్ ల ట్రెండ్ కి ముగింపు లేదు. ఎండ్ లెస్ గా ప్రముఖుల జీవితాలు వెండితెరకెక్కుతున్నాయి. నిజ జీవిత కథల్లో ఆత్మ ఆడియెన్ కి బాగా కనెక్టవుతోంది గనుక బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. అయితే దర్శకుల్లోని కథ చెప్పే ఎబిలిటీ జయాపజయాలను నిర్ధేశిస్తోంది.
తాజా సమచారం మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందుతోందని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా టైటిల్ `సలాకార్`. ఇందులో మౌనిరాయ్ ఒక కీలక పాత్రధారి.
జాతీయ భద్రత, రహస్యం, గూఢచర్యం ప్రధానాంశాలుగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ఇది భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన నిఘా అధికారులలో ఒకరైన అజిత్ దోవల్ జీవితం ఆధారంగా రూపొందుతుందని తెలుస్తోంది. ఫరూక్ కబీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక ఛాలెంజింగ్ గూఢచారి కథను రివీల్ చేస్తుంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా, 15 ఆగస్టు 2025న జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా ప్రీమియర్ కానుంది.
అయితే ఇది అజిత్ దోవల్ బయోపిక్ అనడానికి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. నిర్మాతలు ఇంకా దీనిని ధృవీకరించాల్సి ఉంది. ఫిల్మ్‌ఫేర్ కథనం ప్రకారం.. ప్రస్తుత భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న అజిత్ దోవల్ నిజ జీవిత కథ నుండి సలాకార్ కథను తీసుకున్నారని తెలుస్తోంది. కాస్టింగ్ లో ప్రస్తుతానికి మౌనిరాయ్ పేరు మాత్రమే బయటకు వచ్చింది. టైటిల్ పాత్రధారి సహా మిగిలిన నటీనటుల గురించి వివరాలు ఇంకా గోప్యంగా ఉంచారు.
ఇంతకుముందు దర్శకుడితో మౌని ఫోటోని షేర్ చేయగానే, ఆ ఇద్దరూ కలిసి పని చేస్తున్నారని క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కథాంశం రెండు వేర్వేరు కాలాల్లో సాగుతుంది. గూఢచర్యంతో ముడిపడి ఉన్న రహస్యాలను వెలికితీసే ఒక యువ భారతీయ గూఢచారి ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారని , గూఢచర్య మిషన్ ని ఒక తరం నుంచి ఇంకో తరానికి వారసత్వంగా తరలించే ఒక అద్భుత ప్రయాణాన్ని తెరపై చూపిస్తున్నామని దర్శకుడు ఇంతకుముందు క్లూ ఇచ్చారు.