ఆడిష‌న్స్‌లో అహాన్ ప్ర‌ద‌ర్శ‌న‌ న‌చ్చ‌లేదు: మోహిత్ సూరి

సైయారా కోసం అహాన్ ని ఆడిష‌న్ చేసిన‌ప్పుడు అత‌డు పాపుల‌ర్ హిందీ చిత్రాల నుంచి స‌న్నివేశాల్లో న‌టించి చూపించాడు.;

Update: 2025-07-24 02:45 GMT

అహాన్ పాండే - అనీత్ పద్దా జంటగా నటించిన `సైయ్యారా` సినిమా నాలుగు రోజుల్లో వంద కోట్ల క్ల‌బ్ లో చేరింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. సినిమా ఈ సంవత్సరంలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలుస్తుంద‌ని టాక్. న‌టీన‌టులు స‌హా ద‌ర్శ‌కుడు మోహిత్ సూరిపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. య‌ష్ రాజ్ ఫిలింస్ బెస్ట్ చిత్రాల్లో ఇది ఒక‌టి అన్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

అయితే ఈ సినిమా నాయ‌కానాయిక‌ల ఎంపిక విధానం గురించి మోహిత్ సూరి తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అంతా కొత్త వారితో సినిమాలు చూస్తారా లేదా? అని సంశ‌యిస్తూనే, ఆ ఇద్ద‌రినీ ఎంపిక చేసుకున్నామ‌ని మోహిత్ తెలిపారు. 25 లోపు వ‌య‌సు ఉన్న కుర్రాళ్లు కావాలి. దానికోసం వేటాడాము. ఆడిష‌న్లు చేసాము. సినిమా క‌థ‌, స్క్రిప్టుపై ప‌ని చేస్తున్నప్పుడు నిండా ప్రేమ‌లో మునిగాయి. యాక్ట‌ర్స్ లో నా స్నేహితుల‌ను కొంద‌రిని న‌టించ‌మ‌ని కూడా అడిగాను. మీరు నా కోసం ఒక ప్రేమకథ చేయగలరా? నా కోసం చేయండి! అని అడిగాను. వారు కూడా చేస్తామ‌ని అన్నారు. కానీ నేను ఆది సర్‌ను కలిసినప్పుడు.. పెద్ద స్టార్ల‌తో సినిమా చేయాల‌ని ఎందుకు అనుకుంటున్నావు? అని ప్ర‌శ్నించారు.

పెద్ద స్టార్ల‌తో సినిమాలు చేయ‌గ‌లిగే స‌త్తా ఉన్న సంస్థ ఇది.. కానీ ఈ కథకు 20-25 ఏళ్ల నటులు అవసరమని ఆయన అన్నారు. ఇతర నటులందరూ 30 ఏళ్లలోపువారు... 40 ఏళ్లు దాటిన వారు కావాల‌ని గుర్తు చేసారు. కొత్త‌వారితో సినిమా మార్కెట్ అవ్వ‌ద‌ని తాను భావించిన‌ట్టు మోహిత్ చెప్పారు. కానీ నిర్మాత న‌మ్మి కొత్త‌వారితో సినిమా చేసామ‌ని తెలిపాడు.

సైయారా కోసం అహాన్ ని ఆడిష‌న్ చేసిన‌ప్పుడు అత‌డు పాపుల‌ర్ హిందీ చిత్రాల నుంచి స‌న్నివేశాల్లో న‌టించి చూపించాడు. ఆ ఆడిషన్లు `న్యాయంగా` ఉన్నాయని అతను ఎప్పుడూ భావించలేదు. కబీర్ సింగ్, ఏ దిల్ హై ముష్కిల్, బ్యాండ్ బాజా బారాత్ వంటి చిత్రాల నుండి సన్నివేశాలను ప్రదర్శించాడు కానీ మోహిత్ కి అవేవీ న‌చ్చ‌లేదు. ఈ రకమైన ఆడిషన్లు న్యాయమైనవి కావు.. ఎవ‌రో ఇచ్చిన బెస్ట్ సీన్ల‌లో నటించ‌మ‌ని అడ‌గ‌డం స‌రికాదు.

అయితే మ‌న సినిమాలో ఒరిజిన‌ల్ సీన్ లో చేసేవ‌ర‌కూ ఆ న‌టుడిని అంచ‌నా వేయ‌లేమ‌ని మోహిత్ అన్నారు. అహాన్ ని తాను న‌మ్మ‌లేద‌ని కూడా మోహిత్ నిర్మాత ఆదిత్య చోప్రాకు చెప్పాడు. కానీ హీరో గురించి మ‌ర్చిపో.. అంద‌రూ విందుకు ప‌దండి అని అన్నార‌ట ఆదిత్య చోప్రా. చివ‌రికి మోహిత్ మ‌న‌సు మార్చుకుని అహాన్ తో ముందుకు సాగాడు. అహాన్ త‌న‌ పాత్రలోకి ప‌ర‌కాయం చేయ‌డాన్ని మ‌రుస‌టి రోజు తెల్ల‌వారు ఝామున గ‌మ‌నించాన‌ని మోహిత్ చెప్పారు. అనీత్ ప‌ద్దా ఎంపిక కూడా గ‌మ్మ‌త్త‌యినది. అనీత్ మొదటి ఆడిషన్ కి సెల్ఫ్ టేప్ ఇచ్చింది. త‌ర్వాత YRF కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఆమెతో అవిశ్రాంతంగా పనిచేశారని మోహిత్ తెలిపాడు. ఫోన్‌లో చిత్రీకరించిన సెల్ఫ్ ఆడిషన్ చాలా అద్భుతంగా ఉంది. షానూ శర్మ కూడా ఆడిషన్లు చేసింది .. నాకు విభిన్నమైన టేక్‌లను చూపించింది. ప‌ద్దా ఎవరినీ కాపీ చేయలేదు.. ఒరిజినాలిటీతో చేసింది అని మోహిత్ చెప్పాడు.

Tags:    

Similar News