అప్పుడు టాలీవుడ్‌లో నో... ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్‌!

సరిగ్గా పదేళ్ల క్రితం సాయి ధరమ్‌ తేజ్ హీరోగా నటించిన 'రేయ్‌' సినిమాతో సయామీ ఖేర్‌ నటిగా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా మొత్తం ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెల్సిందే.;

Update: 2025-08-30 06:22 GMT

సరిగ్గా పదేళ్ల క్రితం సాయి ధరమ్‌ తేజ్ హీరోగా నటించిన 'రేయ్‌' సినిమాతో సయామీ ఖేర్‌ నటిగా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా మొత్తం ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమా తెలుగులో చేసిన ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. రేయ్ సినిమా కొంతలో కొంత సాయి ధరమ్‌ తేజ్‌కి గుర్తింపు తెచ్చి పెట్టింది. కానీ కమర్షియల్‌గా ఫ్లాప్‌ కావడంతో సయామీ ఖేర్ కి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. దాంతో తెలుగులో ఆఫర్లు కష్టం అయ్యాయి. తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ను ఈమె సంప్రదించేందుకు ప్రయత్నించినా తిరస్కరణకు గురి అయింది. ఆ సమయంలో బాలీవుడ్‌లో చిన్నా చితకా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే అక్కడ కూడా పెద్దగా గుర్తింపు దక్కలేదు. తెలుగులో మరోసారి వైల్డ్‌ డాగ్‌, హైవే సినిమాలతో అవకాశాలు దక్కాయి. ఆ సినిమాలు కూడా సయామీ ఖేర్‌ కు హిట్‌ను తెచ్చి పెట్టలేదు. దాంతో మొత్తానికి సయామీ ని టాలీవుడ్‌ తిరస్కరించి, ఆమెకు ఆఫర్లు నో అంటూ చెప్పేసింది.

రేయ్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం

టాలీవుడ్‌ నో చెప్పడంతో అప్పటికే పరిచయం ఉన్న బాలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధం అయింది. 2023లో ఈమె 8 ఏఎం మెట్రో అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈమెకు నటిగా గుర్తింపు తెచ్చి పెట్టింది. అదే ఏడాది మరో సినిమాతో సయామీ ఖేర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి అభిషేక్‌ బచ్చన్‌ తో కలిసి చేసిన స్పోర్ట్స్ డ్రామా ఆకట్టుకుంది. అంతే కాకుండా నటిగా మరింత మంచి పేరును తెచ్చి పెట్టింది. అక్కడ నుంచి ఈమె జోరు పెరుగుతూ వస్తోంది. ఏడాదికి రెండు సినిమాల చొప్పున ఈమె చేస్తోంది. గత ఏడాది ఈమె నటించిన రెండు హిందీ సినిమాలు విడుదల అయ్యాయి. అందులో అగ్ని తో మంచి పేరును సొంతం చేసుకోవడంతో మరిన్ని ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే జాట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

జాట్‌ మూవీలో సయామీ ఖేర్‌

సన్నీ డియోల్‌ ప్రధాన పాత్రలో నటించిన జాట్‌ సినిమాలో ఎస్‌ఐ పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలోని సయామీ ఖేర్‌ నటనకు మంచి స్పందన దక్కింది. అందుకే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ మోస్ట్‌ క్రేజీ మల్టీస్టారర్ మూవీలో నటించే అవకాశం దక్కింది. అక్షయ్‌ కుమార్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ హీరోలుగా రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్‌గా సయామీ ఖేర్ కు ఛాన్స్ దక్కింది. ఇప్పటికే ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఇంతటి క్రేజీ మల్టీస్టారర్‌ మూవీలో ఈమెకు చోటు దక్కడంతో ఖచ్చితంగా ముందు ముందు బాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా మారుతుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. 17 ఏళ్ల తర్వాత అక్షయ్‌ కుమార్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పై బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

17 ఏళ్ల తర్వాత అక్షయ్‌ కుమార్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ మూవీ...

సయామీ ఖేర్‌ ఫ్యామిలీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్‌ ఉన్న వారు కావడంతో ఈజీగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ముఖ్యంగా తండ్రి అద్వైత్‌ ఖేర్‌ సుదీర్ఘ కాలం పాటు మోడల్‌గా చేశారు. దాంతో ఇండస్ట్రీలో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక తల్లి సైతం మోడలింగ్‌లో ఉంది. 1980 ల్లో చాలా అందాల పోటీల్లో గెలిచి ఉత్తర ఖేర్‌ మంచి గుర్తింపును దక్కించుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సయామీ ఖేర్ కు మొదట్లో టాలీవుడ్‌ నుంచి తిరస్కరణ ఎదురైంది, అక్కడ నో చెప్పడంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టడం, అక్కడ కూడా ఓపికగా సినిమాలు చేయడంతో ఇప్పుడు సయామీ ఖేర్‌ కెరీర్‌ స్పీడ్‌ అందుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పదేళ్ల తర్వాత ఒక బిగ్‌ ప్రాజెక్ట్‌ ను సయామీ ఖేర్ దక్కించుకుంది. రాబోయే పదేళ్లు ఈమెను ఆపే వారే ఉండరేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News