బాలీవుడ్ మూవీకి హై బజ్.. అది కొరియన్ రీమేకా?

బాలీవుడ్ మూవీ, రొమాంటిక్ యూత్ ఎంటర్టైనర్ సైయారా ఇప్పుడు సినీ ప్రియులను ఫుల్ గా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. మూవీ లవర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.;

Update: 2025-07-21 10:31 GMT

బాలీవుడ్ మూవీ, రొమాంటిక్ యూత్ ఎంటర్టైనర్ సైయారా ఇప్పుడు సినీ ప్రియులను ఫుల్ గా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. మూవీ లవర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. మంచి వసూళ్లు కూడా రాబడుతోంది. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల్లో కలిపి రూ.45 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

దిగ్గజ నటుడ చిక్కి పాండే తనయుడు, యంగ్ బ్యూటీ అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే హీరోగా నటించిన ఆ సినిమాను మోహిత్ సూరి తెరకెక్కించారు. హీరోయిన్ గా అనీత్ పడ్డా నటించిన ఆ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అక్షయ్ విధాని నిర్మించారు. హీరో, హీరోయిన్లు ఇద్దరికీ ఇది డెబ్యూ కావడం విశేషం.

డెబ్యూనే అయినా హీరో హీరోయిన్స్ ఇద్దరూ యాక్టింగ్ తో అదరగొట్టారని అంతా కొనియాడుతున్నారు. రొమాంటిక్ డ్రామాగా సినిమా అదిరిపోయిందని అంటున్నారు. సోల్ ఫుల్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టిందని చెబుతున్నారు. ప్రేమ ఈజీగా దొరకదని.. పెయిన్, హార్ట్ బ్రేక్, హీలింగ్ కచ్చితంగా ఉంటాయనే కాన్సెప్ట్ బాగుందని చెబుతున్నారు.

అదే సమయంలో సినిమా ఒరిజినాలిటీపై కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. 2004లో వచ్చిన కొరియన్ చిత్రం ఎ మూమెంట్ టు రిమెంబర్ కథాంశాన్ని దగ్గరగా పోలి ఉందని చెబుతున్నారు. జాన్ హెచ్ లీ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళ భావోద్వేగ ప్రభావాన్ని అనుసరిస్తుందని అంటున్నారు.

ఇప్పుడు సైయారా కథ కూడా అలాంటిదేనని చెబుతున్నారు. అనధికారిక రీమేక్‌ అని ఆరోపిస్తున్నారు. దయచేసి ఒరిజినల్‌ కు కొంత క్రెడిట్ ఇవ్వండని అంటున్నారు. మరికొందరు సినిమాను ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా అయిన ఆషికి 2 తో పోల్చారు. అయితే ఇంకొందరు సైయారా మూవీని సమర్థిస్తున్నారు.

రీమేక్ కాదని అంటున్నారు. స్టోరీ కాస్త ఒకేలా ఉన్నప్పటికీ.. భారతీయ ప్రేక్షకులకు తగ్గట్లు తీశారని చెబుతున్నారు. ఎ మూమెంట్ టు రిమెంబర్ కూడా ఒక జపనీస్ డ్రామా ఆధారంగా రూపొందించారని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి సైయారా రీమేక్ అంటూ వస్తున్న వార్తలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. మరి రెస్పాండ్ అవుతారేమో చూడాలి.

Tags:    

Similar News