రూ.100 కోట్లు క్రాష్‌... కొత్త వారి సినిమా జోరు

కానీ హీరో, హీరోయిన్‌ ఇద్దరూ కొత్త వారు ఉన్నప్పటికీ 'సయ్యారా' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.;

Update: 2025-07-22 11:30 GMT

బాలీవుడ్‌లో గత ఐదు సంవత్సరాలుగా పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయి. సినిమాలు వరుసగా వస్తున్నాయి కానీ ఏ ఒక్కటీ బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లను సొంతం చేసుకోలేక పోయింది. అంతే కాకుండా పెద్ద హీరోల సినిమాలు మినిమం ఓపెనింగ్స్‌ను సైతం రాబట్టలేక కిందా మీదా పడుతున్నాయి. అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్స్‌ సినిమాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా ఫెయిల్‌ అయ్యాయి. కానీ హీరో, హీరోయిన్‌ ఇద్దరూ కొత్త వారు ఉన్నప్పటికీ 'సయ్యారా' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి మూడు రోజుల్లోనే సినిమా వంద కోట్ల క్లబ్‌లో జాయిన్ కావడం సంచలనంగా మారింది.

చిత్ర యూనిట్‌ సభ్యులు 'సయ్యారా' సినిమా రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిందని అధికారికంగా ప్రకటించారు. సినిమాకు వచ్చిన ప్రీ రిలీజ్ బజ్‌ నేపథ్యంలో విడుదల రోజే దాదాపు రూ.20 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. కొత్త హీరో, హీరోయిన్‌ సినిమాలు మొదటి రోజు ఆ స్థాయిలో వసూళ్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. మంచి ఓపెనింగ్‌ దక్కడంతో సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొదటి వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి సినిమా ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసిందని హిందీ బాక్సాఫీస్‌ వర్గాల వారు చెబుతున్నారు. ఇదంతా వీకెండ్‌ వరకే అని, వీక్‌ డేస్‌లో సినిమా వీక్‌ కావడం ఖాయం అని అంతా భావించారు.

నిన్న సోమవారం సైతం సయ్యారా సినిమాకు వచ్చిన వసూళ్లు చూసి బాక్సాఫీస్‌ వర్గాల వారు సైతం షాక్‌ అయ్యారట. చాలా తక్కువ సమయంలోనే వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సయ్యారా సినిమా యూనిట్‌ సభ్యులు సోమవారం వచ్చిన వసూళ్లను చూస్తే సినిమా ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంలో మ్యూజిక్‌ ప్రధాన పాత్ర పోషించింది. మ్యూజిక్ లవర్స్ ఈ సినిమాను తెగ ఎంజాయ్‌ చేస్తున్నామని చెబుతున్నారు. మ్యూజిక్‌ కారణంగానే సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

అహన్‌ హీరోగా అనీత్‌ హీరోయిన్‌గా మోహత్‌ సూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యూత్‌ ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఒక్క సినిమాతోనే అహన్‌, అనీత్‌లు బాలీవుడ్‌లోనే కాకుండా ఇండియా మొత్తం మోస్ట్‌ పాపులర్‌ యంగ్‌ స్టార్స్‌గా నిలిచి పోయారు. హీరోయిన్‌ అనీత్‌ ను సౌత్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రముఖ దర్శకులు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక హీరో అహన్‌ పాండే తో ప్రముఖ నిర్మాత సినిమాను నిర్మించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి సయ్యారా సినిమా బాలీవుడ్‌ కి సైతం చాలా మంచి టర్నింగ్‌ పాయింట్‌గా నిలువబోతుంది. 2025లో బిగ్గెస్ట్‌ సినిమాల జాబితాలో ఖచ్చితంగా సయ్యారా సినిమా నిలుస్తుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News