• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయి పల్లవి సీక్రెట్ గా...

సాయి పల్లవి సీక్రెట్ గా జపాన్ ఎందుకెళ్లింది..?

| రీసెంట్ గా చెల్లి పెళ్లి సందడి ముగించుకున్న సాయి పల్లవి సీక్రెట్ గా జపాన్ వెళ్లిందని తెలుస్తుంది

By - Tupaki Desk
Update: 2024-02-02 17:30 GMT

సౌత్ ఆడియన్స్ అంతా కూడా ఎక్కువగా ఇష్టపడే హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. తెలుగులో అయితే ఆమెను లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చి మరీ పిలుస్తారు. ఎంచుకునే పాత్రలకు ఆమె చూపించే అభినయం ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. 2022 లో విరాటపర్వంలో నటించిన సాయి పల్లవి ఆ తరాత తెలుగులో గ్యాప్ తీసుకుంది. ఈమధ్యనే నాగ చైతన్యతో తండేల్ సినిమాను సైన్ చేసింది. సినిమాలో సాయి పల్లవి రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు.

రీసెంట్ గా చెల్లి పెళ్లి సందడి ముగించుకున్న సాయి పల్లవి సీక్రెట్ గా జపాన్ వెళ్లిందని తెలుస్తుంది. ఇంతకీ సాయి పల్లవి జపాన్ ఎందుకెళ్లింది అని ఆరా తీస్తే బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసమని తెలుస్తుంది. బాలీవుడ్ రామాయణంలో సీత పాత్రలో సాయి పల్లవిని ఓకే చేసిన విషయం తెలిసిందే. అయితే అదే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ సినిమా అనుకున్నారు కానీ దానికన్నా ముందే ఒక హిందీ సినిమాకు సైన్ చేసింది సాయి పల్లవి.

ఆమీర్ ఖాన్ పెద్ద కొడుకు జునై ఖాన్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ఈ హీరో మొదటి సినిమా యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తుంది. అయితే రెండో సినిమా కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారట. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తైందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకే సాయి పల్లవి జపాన్ వెళ్లిందట. జపాన్ లో ఇప్పటివరకు ఏ సినిమా షూటింగ్ కూడా చేయని సప్పోరో ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందట.

సినిమా యూనిట్ అంతా సైలెంట్ గా అక్కడ షూటింగ్ లో పాల్గొన్నారని తెలుస్తుంది. తెలుగుతో పాటుగా సాయి పల్లవి హిందీలో కూడా బిజీ అవ్వాలని చూస్తుంది. తనయుడి సినిమా బాధ్యతని ఆమీర్ ఖాన్ దగ్గర ఉండి చూసుకుంటున్నారని తెలుస్తుంది. సాయి పల్లవి నటిస్తుంది అంటే కచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉండే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఏ సినిమా షూట్ చేయని ప్లేస్ లో సినిమా షూట్ చేస్తున్నారు అంటే సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది. ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎక్కడ చిన్న లీక్ కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. సాయి పల్లవి బాలీవుడ్ ప్లాన్స్ భారీగానే ఉన్నాయని దీన్ని బట్టి చూస్తే అర్ధమవుతుంది.


Tags:    
  • Saipallavi 
  • Filmindustry 
  • Japan 
  • Thandel 
  • Tollywoodactress 
  • Saipallavicareer 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS