• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏకంగా బాలీవుడ్ ఛాన్స్...

ఏకంగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి

| ఆమె హీరోయిన్​గా బాలీవుడ్ స్టార్​ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్​తో కలిసి ఓ సినిమా చేస్తుందని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-13 18:02 GMT

అందం కాదు.. అభినయమే ప్రధానం అంటూ నేచురల్ హీరోయిన్​గా అభిమానుల్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. ఎప్పుడూ పాజిటివ్‌ దృక్పథంతో ఉండే ఈమె.. మేకప్‌ లేకుండా ఎంపిక చేసుకున్న పాత్రలకు ప్రాణం పోస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసుకుంటూ రాణిస్తోంది. అయితే గత కొద్ది కాలంగా ఆమె ఎక్కువగా సినిమాలు చేయట్లేదు. 2022లో విరాట్ పర్వం, గార్గి చిత్రాలతో పలకరించిన ఆమె.. ప్రస్తుతం ఓ సినిమా మాత్రమే చేస్తోంది.

అయితే గత కొద్ది రోజులుగా ఆమె పేరు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యలో ఆమె హిందీ రామాయణ్ చిత్రంలో సీతగా కనిపిస్తుందని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడామె పేరు మరోసారి హిందీ మీడియాలో తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఆమె ఓ హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. ఆమె హీరోయిన్​గా బాలీవుడ్ స్టార్​ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్​తో కలిసి ఓ సినిమా చేస్తుందని అంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్​గా ప్రారంభం అయిందని వార్తల్లో రాస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారట. లవ్​ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రం రానుందని అంటున్నారు. త్వరలోనే దీని గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ చిత్రం కనుక నిజమైతే సాయిపల్లవికి ఇదే తొలి హిందీ సినిమా అవుతుంది.

ఇకపోతే జునైద్ ఖాన్​కు ఇది రెండో చిత్రం అవుతుంది. తన తొలి సినిమాను వైఆర్​ఎఫ్​ స్టూడియోస్​ బ్యానర్​లో చేస్తున్నారు. ఇది లవ్​ టుడే హిందీ రీమేక్​ అని చెబుతున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా, జునైద్ ఖాన్​.. లాస్​ ఏంజెల్స్​లోని అమెరికన్ అకాడమీ డ్రామా ఆఫ్ ఆర్ట్స్​లో ట్రైనింగ్ తీసుకున్నారు.

ఇకపోతే సాయి పల్లవి ప్రస్తుతం.. శివ కార్తికేయన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో చేస్తోంది. యూనివర్సల్ స్టార్​ కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తోంది.

Tags:    
  • Saipallavi 
  • Bollywood 
  • Tollywood 
  • Staractress 
  • Virataparvam 
  • Telugu 
  • Tamil 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS