నితిన్ లిటిల్ హార్ట్స్.. షాకింగ్ ట్విస్ట్..!

లిటిల్ హార్ట్స్ తరహాలో కామెడీ ఎంటర్టైనర్ గా అది కూడా నితిన్ లవర్ బోయ్ ఇమేజ్ కి తగినట్టుగా కథ రాసుకున్నాడట సాయి మార్తాండ్.;

Update: 2025-10-12 05:43 GMT

రీసెంట్ గా యంగ్ టీం అంతా కలిసి చేసి సూపర్ హిట్ అందుకున్న సినిమా లిటిల్ హార్ట్స్. మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నాగారం జంటగా తెరకెక్కిన ఈ సినిమాను సాయి మార్తాండ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ తో ఇండస్ట్రీ కూడా షేక్ అయ్యింది. ఎందుకంటే వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసి వేల కోట్లు కలెక్ట్ చేయడం కాదు జస్ట్ రెండు మూడు కోట్లతో సినిమా తీసి అది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి ఆ సినిమాతో 40, 50 కోట్లు కలెక్ట్ చేయడం అసలు సిసలైన విజయం అనిపిస్తుంది.

సాయి మార్తాండ్ లిటిల్ హార్ట్స్ 2..

లిటిల్ హార్ట్స్ టీం పడిన కష్టానికి ఈ సక్సెస్ అనేది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఐతే లిటిల్ హార్ట్స్ తర్వాత డైరెక్టర్ సాయి మార్తాండ్ ఏ సినిమా చేస్తాడన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. లిటిల్ హార్ట్స్ 2 సినిమా ఒకటి జరుగుతుందని టాక్. ఆమధ్య ఇంటర్వ్యూస్ లో కూడా లిటిల్ హార్ట్స్ 2 పై సాయి మార్తాండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐతే ఆ సినిమా సీక్వెల్ ఉంటుందా లేదా అన్నది కన్ ఫర్మేషన్ కి ఇంకాస్త టైం పట్టేలా ఉంది.

ఇక లేటెస్ట్ గా లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ లవర్ బోయ్ నితిన్ కి ఒక కథ వినిపించాడట. లిటిల్ హార్ట్స్ తరహాలో కామెడీ ఎంటర్టైనర్ గా అది కూడా నితిన్ లవర్ బోయ్ ఇమేజ్ కి తగినట్టుగా కథ రాసుకున్నాడట సాయి మార్తాండ్. నితిన్ అసలే ఈమధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అతను కెరీర్ లో ఒక అర్జెంట్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. భీష్మ తర్వాత వరుస ప్రయత్నాలైతే చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం దక్కట్లేదు.

నితిన్ టీం అప్ రీఫ్రెషింగ్ కాంబో..

అందుకే యంగ్ టీం తో సినిమా చేయాలని చూస్తున్నాడు నితిన్. లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ తో నితిన్ టీం అప్ అయితే తప్పకుండా ఆడియన్స్ కి మరో రీఫ్రెషింగ్ కాంబో సెట్ అయినట్టే అవుతుంది. తమ్ముడు రిజల్ట్ తో నితిన్ తో ఎల్లమ్మ సినిమా చేసి రిస్క్ చేయడం ఎందుకని దిల్ రాజు భావిస్తున్నాడు. విక్రం కె కుమార్ తో నితిన్ సినిమా ఒకటి డిస్కషన్ లో ఉంది. ఈ గ్యాప్ లో సాయి మార్తాండ్ తో నితిన్ సినిమా చర్చలు నడుస్తున్నాయి. ఆ సినిమా కన్ ఫర్మ్ అయితే మాత్రం యంగ్ టీం తో నితిన్ కచ్చితంగా ఒక మంచి ఎనర్జిటిక్ సినిమా చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

నితిన్ కూడా కెరీర్ లో బ్యాడ్ ఫేజ్ ని ఫేస్ చేస్తున్నాడు. సో ఈ టైం లో అతను తీసుకునే నిర్ణయాలే అతని కెరీర్ ని మార్చే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News