చంద్రబాబు, వైస్ పొలిటికల్ సినిమా.. ఎన్టీఆర్ గా ఎవరు?
ఆదివారం సాయికుమార్ పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ ఓ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.;
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవా కట్టా లేటెస్ట్ గా తెరకెక్కించిన చిత్రం మాయసభ. ఈ సినిమాను దేవా కట్టా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించాకు. నటుడు ఆది పినిశెట్టి, చైతన్యరావు కీలక పాత్రల్లో నటించారు. ఇద్దరు రాజకీయ నాయకులైన స్నేహితుల మధ్య కథగా ఇది రూపొందింది. తెలుగు సీనియర్ నటుడు సాయికుమార్ సహాయ పాత్ర పోషించారు.
ఆదివారం సాయికుమార్ పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ ఓ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో సాయి కుమార్ కారులో కూర్చొని అభిమానుకు అభివాదం చేస్తున్నారు. పోస్టర్ లో ఆయనను బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. ఆయనపై తలపై పూలు, కళ్లకు కళ్లజోడు ఉన్నాయి. ఇది చూస్తే ఎన్నికల్లో నెగ్గిన తర్వాత సీన్ లాగా అనిపిస్తుంది.
ఈ పోస్ట్ కు దేవా కట్టా.. సాయి కుమార్ గారు, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య తరువాత మాయ సభతో మీతో మూడవసారి పని చెయ్యడం చాలా ఎంజాయ్ చేశాను. నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా మీకు నచ్చిన పాత్రలు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయ్యాలని మీ అభిమానిగా ఆశిస్తున్నాను. ఇక్కడ మీరు ఏ పాత్ర పోషించారో కానీ, తుక్కు రేగ్గొట్టారు!!! తెలుగు ప్రేక్షకులు ఆగస్టు 7న మరోసారి మీ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు! హ్యాపీ బర్త్ డే సాయి కుమార్. అంటూ దేవా కట్టా పోస్ట్కు క్యాప్షన్ రాసుకొచ్చారు.
అయితే ఈ సినిమాలో సాయి కుమార్ పాత్రపై ఈ పోస్టర్ ఊహాగానాలు రేకెత్తిస్తుంది. ఆయన ఇందులో విలక్షణ నటుడు, రాజకీయ నాయకుడు ఎన్.టి. రామారావు (సీనియర్ ఎన్టీఆర్) పాత్రలో నటించి ఉండవచ్చని అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమా కథ టీడీపీ సీనియర్ నేత చంద్రబాబు నాయుడు, దివంగత వై ఎస్. రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రయాణాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సాయి కుమార్.. సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.
కానీ సినిమా నిర్మాతలు అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా ఈ కథలోని పాత్రలు పూర్తిగా కల్పితమైనవని.. రాజకీయ భావోద్వేగాలు, సైద్ధాంతిక కథాంశం ఆధారంగా తెరక్కిస్తున్నట్లు దేవా కట్టా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా రిలీజైన సాయి కుమార్ పోస్టర్ చూసి నెటిజన్లు ఈ విధంగా ఊహించుకుంటున్నారు.
ఇక దర్శకుడు చెప్పినట్లుగా ఈ సినిమాలో సాయి కుమార్ ఏ పాత్ర పోషించారో, దాని ప్రభావం ఎలా ఉంటుందోనని సినీప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఆగస్టు 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది.