మెగా మేనల్లుడి SYG.. ప్రీ గ్లింప్స్ తోనే హైప్ ఎక్కించారుగా!
అయితే ప్రీ గ్లింప్స్ ను చూసుకుంటే.. ప్రజలంతా పరుగులు తీస్తున్న సీన్ తో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయుధాలు సిద్ధమవుతున్నట్లు చూపించారు.;
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు- SYG. పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా.. సాయి తేజ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. దసరా కానుకగా నేడు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
అక్టోబర్ 15వ తేదీన సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు కానుకగా.. అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ఇటీవల వెల్లడించారు. అసుర ఆగమనానికి ముహూర్తం ఫిక్స్ అయిందని, అభిమానుల కోసం స్పెషల్ గా గ్లింప్స్ సిద్ధం చేస్తున్నామని. ఈ సారి అది మీ అంచనాలను మించి ఉండబోతుందంటూ ఒక్కసారిగా ఆసక్తి రేపారు.
ఇప్పుడు సినిమా నుంచి ప్రీ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ ప్రియులను తెగ్గ మెప్పిస్తోంది. బోల్డ్ & బ్రూటల్ కానీ ఉద్దేశపూర్వకమైనది.. విజయదశమి సందర్భంగా ఇప్పుడు ఆవేశపూరిత SYG ప్రీ గ్లింప్స్ అంటూ రాసుకొచ్చారు. అసుర ఆగమనం అక్టోబర్ 15న ఉంటుందని మకేర్స్ తెలిపారు.
అయితే ప్రీ గ్లింప్స్ ను చూసుకుంటే.. ప్రజలంతా పరుగులు తీస్తున్న సీన్ తో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయుధాలు సిద్ధమవుతున్నట్లు చూపించారు. ఇంతలో పవర్ ఫుల్ గా సాయి దుర్గ తేజ్ ఎంట్రీ ఇస్తారు. తనదైన శైలిలో చంపుకుంటూ దూసుకుపోతారు. మొత్తంగా గ్లింప్స్ అంతా వైలెన్స్ తో డార్క్ మోడ్ లోనే ఉంది.
బ్యాక్ గ్రౌండ్ లో వచ్చి సాంగ్.. స్పెషల్ గా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ప్రీ గ్లింప్స్ అదిరిపోయిందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని, హైప్ ఎక్కించారని మరికొందరు చెబుతున్నారు. సంబరాల ఏటి గట్టు మూవీ కోసం వెయిటింగ్ అంటూ ఇంకొందరు అంటున్నారు.
నిజానికి.. సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రూపొందుతున్న మూవీ.. గత నెలలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఊహించని స్ట్రైక్, కొన్ని కీలక సీజీ వర్క్ కారణంగా ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు వాయిదా వేస్తున్నామని కొద్ది రోజుల అనౌన్స్ విషయం తెలిసిందే.
ఇప్పుడు సినిమాను త్వరలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ విలన్ రోల్ లో నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. బి అజనీష్ లోక్‌నాథ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.