సాయి ధరమ్ తేజ్ డ్రీమ్ కారు ఏదో తెలుసా..?

తన గ్యారేజ్ లో మహేంద్ర థార్ తో పాటు నా రాయన్ ఎన్ ఫీల్డ్ అంటే ఇష్టమని.. 1968 షెల్బీ జీటీ 500 మస్టంగ్ మోడల్ కారు తన డ్రీమ్ కారని.. ఎప్పటికైనా ఆ కారు కొనాలన్నది తన కోరిక అన్నారు తేజ్.;

Update: 2025-10-12 05:05 GMT

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఆటో ఎక్స్ పో 2025లో మెగా హీరో సాయి ధరం తేజ్ పార్టిసిపేషన్ ఆ షోకి స్పెషల్ క్రేజ్ తెచ్చింది. స్టూడెంట్స్ తో తేజ్ ఇంటరాక్షన్ అతని ఎక్స్ పీరియన్స్ అంతా వాళ్లతో షేర్ చేసుకున్నారు. ఇక వారిలో ఫలానా హీరో మీద మీ అభిప్రాయం ఏంటంటూ కొంతమంది ప్రశ్నలు అడిగారు. పవన్ కళ్యాణ్ గురించి అడిగితే.. పవన్ కళ్యాణ్ నా గురువు.. ఆయనే తనకు అన్నీ నేర్పించారు. బుక్స్ చదవడం దగ్గర నుంచి కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ ఇలా అన్నిటిలో ఆయన సపోర్ట్ ఇచ్చారు.

కళ్యాణ్ మామయ్య మీద తన ప్రేమ అభిమానం..

నన్ను గైడ్ చేసిన వ్యక్తి ఆయన హి ఈజ్ మై గురు అంటూ కళ్యాణ్ మామయ్య మీద తన ప్రేమ అభిమానం ఏంటో చూపించారు సాయి తేజ్. ఇక ఇదే చిట్ చాట్ లో భాగంగా అల్లు అర్జున్ గురిచి అడిగితే.. ఆయన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా.. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంటుందని అన్నారు తేజ్. ఇక ప్రభాస్ గురించి కూడా చెబుతూ అతను మన డార్లింగ్.. మోస్ట్ హంబుల్ ఇంకా స్వీట్ పర్సన్ అని అన్నారు తేజ్.

మెగాస్టార్ చిరంజీవి గారితో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి సినిమా చేయాలని ఉందని అన్నారు తేజ్. తన గ్యారేజ్ లో మహేంద్ర థార్ తో పాటు నా రాయన్ ఎన్ ఫీల్డ్ అంటే ఇష్టమని.. 1968 షెల్బీ జీటీ 500 మస్టంగ్ మోడల్ కారు తన డ్రీమ్ కారని.. ఎప్పటికైనా ఆ కారు కొనాలన్నది తన కోరిక అన్నారు తేజ్.

తేజ్ సంబరాల యేటిగట్టు..

ఇక తేజ్ సినిమాల విషయానికి వస్తే సంబరాల యేటిగట్టు అంటూ ఒక కొత్త సినిమా చేస్తున్నారు. రోహిత్ కెవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. తేజ్ మాత్రం ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.

సంబరాల యేటిగట్టు సినిమాతో తేజ్ మళ్లీ సూపర్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలు చేసినా సరే తేజ్ మార్క్ కనిపించలేదు అన్న టాక్ ఉంది. తన ఒకప్పటి ఎనర్జీని మళ్లీ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు సాయి తేజ్. ఐతే సంబరాల యేటిగట్టు తేజ్ ఫ్యాన్స్ ని సూపర్ సాటిస్ఫై చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో తేజ్ అనుకున్న సక్సెస్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News