• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డబుల్ ఇస్మార్ట్ డౌట్స్.....

డబుల్ ఇస్మార్ట్ డౌట్స్.. మరోసారి క్లారిటీ ఇచ్చేశారు

| ఇక రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న సందర్భంలో ఒక్కసారిగా రిలీజ్ వాయిదా అనే పుకార్లు స్టార్ట్ అయ్యాయి.

By - Tupaki Desk
Update: 2024-08-09 13:26 GMT

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమాపై కొన్ని రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతుందనే వార్తలు షికార్లు చేస్తుండగా, ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ముంబై లో కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ప్రెస్ మీట్స్ నిర్వహించారు.

అలాగే సినిమాకు సంబంధించిన సాంగ్స్ విడుదల చేయగా పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న సందర్భంలో ఒక్కసారిగా రిలీజ్ వాయిదా అనే పుకార్లు స్టార్ట్ అయ్యాయి. వివిధ కారణాల వలన చిత్ర యూనిట్ సినిమాను వచ్చే నెలకు వాయిదా వేస్తోందని కూడా కథనాలు వచ్చాయి.

ఇక ఫైనల్ చిత్రబృందం ఈ రూమర్స్ కు చెక్ పెట్టె ప్రయత్నం చేసింది. 'డబుల్ ఇస్మార్ట్' వాయిదా విషయం పూర్తిగా నిరాధారం అని, అవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అభిమానులకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. "వీలైనంతవరకు ఇలాంటి నిరాధారమైన, ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దు" అంటూ విజ్ఞప్తి చేశారు.

సినిమా యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం, అన్ని పనులు సవ్యంగా సాగుతున్నాయి. అనుకున్న తేదీకే అంటే ఆగస్టు 15న, ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధంగా ఉందని తెలిపారు. అభిమానులు థియేటర్లలో వచ్చే మాస్ ఎఫెక్ట్‌కు సిద్ధం కావాలని సూచించారు. ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ తర్వాత, పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్‌లో వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవలే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం విడుదలపై మరింత ఆసక్తి నెలకొంది. రామ్ పోతినేని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండనుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది. సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. కావ్య తప్పర్ రామ్ కు జోడిగా నటించింది. మరి సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    
  • Doubleismart 
  • Rampothineni 
  • Purijagannadh 
  • Charmeekaur 
  • Kavyathapar 
  • Movierelease 
  • Sanjaydutt 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS