సోషల్ మీడియా షేక్ చేస్తున్న రుక్మిణి..!
కాంతారా ప్రీక్వెల్ లో రుక్మిణి వసంత్ కనకావతి రోల్ లో నటిస్తుంది. మహారాణి గెటప్ లో రుక్మిణి పోస్టర్ రిలీజ్ తోనే సూపర్ అనేశారు.;
రుక్మిణి వసంత్ ప్రెజంట్ యూత్ ఆడియన్స్ కి ఒక క్రష్ గా మారింది. కన్నడలో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఆడియన్స్ అందరికీ దగ్గరైంది. ఇప్పటికే తమిళ్ లో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్న అమ్మడు మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ కాంతారా ప్రీక్వెల్ లో ఛాన్స్ అందుకుంది. కాంతారా సినిమాకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే.. ఆ క్రేజ్ ని మరింత పెంచేలా రుక్మిణి తోడవుతుంది. కాంతారా ప్రీక్వెల్ లో రుక్మిణి వసంత్ కనకావతి రోల్ లో నటిస్తుంది. మహారాణి గెటప్ లో రుక్మిణి పోస్టర్ రిలీజ్ తోనే సూపర్ అనేశారు.
యూత్ ఆడియన్స్ లో క్రేజ్..
ఇక కాంతారా ప్రీక్వెల్ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ కాగా అందులో రుక్మిణి సీన్స్ అయితే వేరే లెవెల్ అనేలా ఉన్నాయి. రుక్మిణి వసంత్ కనకావతి రోల్ లో వారెవా అనిపించేసింది. అసలే యూత్ ఆడియన్స్ లో ఆమె క్రేజ్ ఒక రేంజ్ లో ఉండగా కాంతారా ట్రైలర్ లోనే రుక్మిణి వసంత్ సీన్స్ ఇంప్రెస్ చేశాయి. కాంతారా లో ఆమెను తీసుకోవడానికి రీజనే ఆమెకు ఉన్న ఈ పాపులారిటీ వర్క్ అవుట్ అవుతుందని. జస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది అంతే అందులో ఆమె షాట్స్ ని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ కి రాని క్రేజ్ రుక్మిణి వసంత్ కి వచ్చింది. ఆమె క్యూట్ లుక్స్ ఇప్పటికే ఎంతోమంది హృదయాలను కొల్లగొడుతుంటే కాంతారా లో యువరాణి పాత్రలో ఆమె క్రేజీగా అనిపిస్తుంది. కాంతారా ప్రీక్వెల్ లో మెయిన్ హైలెట్స్ చాలా ఉన్నా కూడా వాటిలో రుక్మిణి వసంత్ కూడా ఒకటిగా మారేలా ఉన్నాయి. కాంతారా ప్రీక్వెల్ లో రుక్మిణి వన్ ఆఫ్ ది ఎట్రాక్టింగ్ పాయింట్ గా మారింది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ..
తెలుగులో కూడా రుక్మిణికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. అందుకే అమ్మడిని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి ఓకే చేశారు. ఆల్రెడీ కోలీవుడ్ లో అమ్మడు విజయ్ సేతుపతి, కార్తికేయతో నటించింది. అక్కడ కూడా స్టార్ లీగ్ లోకి వెళ్లింది రుక్మిణి.
తప్పకుండా రుక్మిణి వసంత్ సౌత్ నెంబర్ 1 హీరోయిన్ గా సత్తా చాటే ఛాన్స్ ఉంది. కాంతారా ప్రీక్వెల్ క్లిక్ అయితే రుక్మిణి రేసులో మరింత దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. కన్నడ భామలకు టాలీవుడ్ లక్కీ అని తెలిసిందే. సో రష్మిక తర్వాత రుక్మిణి కూడా టాలీవుడ్ టాప్ లేపే రేంజ్ లో ఛాన్స్ లు అందుకునేలా ఉంది.