సాంప్రదాయంగా ఆకట్టుకుంటున్న రుక్మిణీ వసంత్!
అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో చెప్పడం అసాధ్యం. అందుకే ఆ అదృష్టం పట్టినప్పుడే సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు.;
అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో చెప్పడం అసాధ్యం. అందుకే ఆ అదృష్టం పట్టినప్పుడే సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తన అద్భుతమైన నటనతో ఏకంగా వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రుక్మిణీ వసంత్. 2024లో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఇటీవల రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'కాంతార' సీక్వెల్ 'కాంతార చాప్టర్ 1' లో హీరోయిన్ గా అవకాశం అందుకొని భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
ముఖ్యంగా తన అందంతోనే కాదు నటనతో అందరినీ అబ్బురపరిచిన ఈమె.. కొన్ని కొన్ని సన్నివేశాలలో హీరో రిషబ్ శెట్టి కంటే కూడా అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఈమె లెవెల్ భారీగా పెరిగిపోయింది అనడంలో సందేహం లేదు. ఇందులో సాంప్రదాయంగా మహారాణి కనకావతీ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. అయితే అలాంటి ఈమె తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా అందులో అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా పూజా కన్నన్ డిజైన్ చేసిన పర్పుల్ కలర్ లెహంగా ధరించి తన అందాలతో మరొకసారి మెస్మరైజ్ చేసింది. దీనికి కాంబినేషన్లో కలంకారీ తో డిజైన్ చేసిన పైటతో తన మేకోవర్ను ఫుల్ ఫిల్ చేసింది. పగడాలు పొదిగిన సింపుల్ జువెలరీ తో తన అందాన్ని మరింత రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. మొత్తానికైతే పర్పుల్ కలర్ లెహంగాలో చాలా సాంప్రదాయంగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రుక్మిణి వసంత్ సినిమాల విషయానికి వస్తే.. రక్షిత్ శెట్టి హీరోగా హేమంత్ ఎం రావు దర్శకత్వంలో వచ్చిన 'సప్త సాగరాలు దాటి' అనే చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తమిళంలో ఎస్ అనే చిత్రంలో నటించిన ఈమె.. ఆ తర్వాత ఏ. ఆర్.మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన మదరాసి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
1994 డిసెంబర్ 10న కర్ణాటకలోని బెంగళూరులో కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. భారతదేశ అత్యున్నత శాంతి కాల సైనిక అలంకరణ అయిన అశోక చక్ర కర్ణాటక రాష్ట్రం నుండి పొందిన మొదటి వ్యక్తిగా పేరు దక్కించుకున్నారు.