రుక్మిణికి మరో క్రేజీ ఆఫర్?
దీంతో పాటూ తమిళ సినిమాలు ఏస్, మదరాసిలో కూడా రుక్మిణి నటిస్తోంది.;
సప్త సాగారాలుదాచే ఎల్లో సెడ్ ఎ మరియు సైడ్ బి సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ తుఫానులా దూసుకెళ్తుంది. ఆ సినిమాలు చూశాక రుక్మిణిని ఇండియన్ సినిమా మొత్తం తమ సినిమాల కోసం లాక్ చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్31 కోసం రుక్మిణి ఎంపికైందని సమాచారం.
దీంతో పాటూ తమిళ సినిమాలు ఏస్, మదరాసిలో కూడా రుక్మిణి నటిస్తోంది. ఇదిలా ఉంటే రుక్మిణి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో భాగమైనట్టు తెలుస్తోంది. థగ్ లైఫ్ సినిమా తర్వాత మణిరత్నం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. అందులో హీరోగా నవీన్ పోలిశెట్టిని అనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఆ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికైందని వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ షూటింగ్ టైమ్ లో రుక్మిణి కొత్త సినిమా ఒప్పుకోకూడదనే రూల్ ను తీసేయాల్సి వస్తుంది. మణిరత్నం సీన్ లోకి వస్తే ఎవరైనా రూల్స్ ను మార్చుకోవాల్సిందేనని ఈ విషయం తెలియచేస్తుంది.
ఒకవేళ నిజంగా రుక్మిణి మణిరత్నం సినిమాలో నటించడం ఓకే అయితే, నీల్ తన రూల్ బుక్ ను దీని కోసం మినహాయించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ వార్త నిజమైతే రుక్మిణి ఇద్దరు మోస్ట్ పవర్‌ఫుల్ డైరెక్టర్లైన మణి రత్నం మరియు నీల్ తో ఒకేసారి సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నదవుతుంది. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కన్నడ భాషతో కెరీర్ ను స్టార్ట్ చేసిన రుక్మిణి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది.