పాన్ ఇండియా చిత్రాల ముందు హ్యాట్రిక్ ప్లాప్ లు!

మూడు పాన్ ఇండియా చిత్రాల్లో? న‌టించ‌డమంటే ఆషామాషీ కాదు. ఇలా ఈ మూడు సినిమాల‌తో అమ్మ‌డి పేరు మారు మ్రోగిపోతుంది.;

Update: 2025-09-09 16:30 GMT

క‌న్న‌డ బ్యూటీ రుక్మిణీ వ‌సంత్ వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుని సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. 'కాంతార చాప్ట‌ర్ 1', 'టాక్సిక్' , 'డ్రాగ‌న్' లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లోభాగ మ‌వ్వ డంతో? నెట్టింట అమ్మ‌డి పేరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎంతో మంది భామ‌లున్నా? ఈ మూడు అవకాశాలు రుక్మిణీని వెతుక్కుంటూ మ‌రీ వచ్చిన‌ట్లు వ‌చ్చాయి. ఈ విష‌యంలో రుక్మిణీ ఎంతో ల‌క్కీ గాళ్. భాష‌పై మ‌మ‌కారమో? లేక ప్ర‌తిభ వ‌చ్చిన అవ‌కాశాలా? అన్న‌ది ప‌క్క‌న బెడితే?..

మూడు పాన్ ఇండియా చిత్రాల్లో? న‌టించ‌డమంటే ఆషామాషీ కాదు. ఇలా ఈ మూడు సినిమాల‌తో అమ్మ‌డి పేరు మారు మ్రోగిపోతుంది. ఇదే త‌ర‌హాలో అమ్మ‌డి ఖాతాల అంతే జోరుగా హ్యాట్రిక్ ప్లాప్ లు క‌నిపిస్తు న్నాయి. పాన్ ఇండియా చిత్రాల ముందు అమ్మ‌డి కెరీర్ కి ఇదో డ్రాబ్యాక్ గా మారుతోంది. గ‌త ఏడాది తెలు గులో `అపుడో ఎపుడో` అనే సినిమాతో లాంచ్ అయింది. కానీ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేదు. అటుపై కోలీవుడ్ లో విజ‌య్ సేతుప‌తి కి జోడీగా `ఏస్` లో న‌టించింది.

ఈ సినిమా కూడా ప‌రాజ‌యం చెందింది. ఈ రెండు ప‌రాజ‌యాల‌తో త‌దుప‌రి చిత్రంతోనైనా హిట్ అందు కుంటుంద‌ని ఎంతో ఆశ‌ప‌డింది. కానీ ఆ ఆశ కూడా నిరాశ‌గానే మారిపోయింది. ఇటీవ‌లే రిలీజ్ అయిన `మ‌ద‌రాసి`లో అమ్మ‌డు శికార్తికేయ‌న్ కు జోడీగా నటించిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ద్య రిలీజ్ అయిన సినిమా? డిజాస్ట‌ర్ గా తేలిపోయింది. ఈ ప్లాప్ తో రుక్మిణీ వ‌సంత్ ఖాతాలో తొలి హ్యాట్రిక్ ప్లాప్ న‌మోదైంది. దీంతో పాన్ ఇండియా చిత్రాల ముందు ఇదో మ‌చ్చ‌లా మారింది.

విజ‌యాల‌తో రెట్టించిన ఉత్సాహంతో పాన్ ఇండియా చిత్రాల షూటింగ్ పూర్తి చేయాల‌నుకున్న అమ్మ‌డి కిది షాకింగ్ లాంటిదే. ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఎదురవుతాయో తెలీదు. అందుకే ఏ న‌టి అయినా దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెడుతుంది. మ‌రి రుక్మిణీ అలాంటి ప్లానింగ్ ఏదైనా చేస్తుందా? పాన్ ఇండియా సినిమాల త‌ర్వాత ఎలాంటి స్ట్రాట‌జీతో ముందుకెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News