స్టార్ హీరోయిన్ కి ఇదేం వింత అలవాటు..?
కాంతారా 1 తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది కన్నడ భామ రుక్మిణి వసంత్. సినిమాలో కనకావతి గా తన పవర్ చూపించింది.;
కాంతారా 1 తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది కన్నడ భామ రుక్మిణి వసంత్. సినిమాలో కనకావతి గా తన పవర్ చూపించింది. సప్త సాగరాలు దాటి రెండు భాగాలతో సౌత్ ఆడియన్స్ లో పాపులర్ అయిన రుక్మిణి కాంతారా చాప్టర్ 1 తర్వాత మరింత ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం నేషనల్ ఆడియన్స్ ముఖ్యంగా సౌత్ ఆడియన్స్ అంతా కూడా ఆమె మాయలో ఉన్నారు. ఐతే తన కెరీర్ ఇంకా తనకున్న కొన్ని హ్యాబిట్స్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పి షాక్ ఇచ్చింది రుక్మిణి. నటిగా మారడానికి ముందు మోడలింగ్ చేశా అది చూసే మొదటి ఆఫర్ వచ్చిందని చెప్పింది రుక్మిణి.
సప్త సాగరాలు దాటి సినిమాకు ఆడిషన్ కోసం..
సప్త సాగరాలు దాటి సినిమాకు ఆడిషన్ కోసం డైరెక్టర్ కి మెసేజ్ చేశా.. ఐతే దాన్ని చూస్తారని నేను అనుకోలేదు. అది చూసి ఆడిషన్ కి పిలిచి ఛాన్స్ ఇచ్చారు. ఆ మెసేజ్ చూడకపోయి ఉంటే ఆ అవకాశం వచ్చేది కాదు. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయని చెప్పుకొచ్చింది రుక్మిణి. ఇక సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచనతోనే లండన్ లో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశానని చెప్పింది.
తండ్రి ఆర్మీలో ప్రాణాలు విడిచే సరికి చెల్లిని తనని అమ్మే అన్నీ దగ్గర ఉండి చూసుకుందని చెప్పుకొచ్చింది రుక్మిణి. ఇక తనకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టమని.. ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా దగ్గర్లో ఏదైనా లైబ్రరీ ఉందా అని వెతుకుతా.. అక్కడకు వెళ్లి బుక్స్ చదువుతా అంటుంది అమ్మడు. బుక్స్ చదవడం వల్ల క్యారెక్టర్స్ లో ఎలా నటించాలి అన్నది ఇంకా అర్ధమవుతుందని అంటుంది అమ్మడు.
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న హీరోయిన్..
సప్త సాగరాలు దాటి వల్లే కాంతారా 1 ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా ఆఫర్లు వచ్చాయి చేస్తున్నా అంటుంది అమ్మడు. రుక్మిణి వసంత్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న హీరోయిన్ ఈమె. తను కూడా ఊహించని విధంగా ఫాలోయింగ్ పెంచుకున్న ఈ అమ్మడు చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్ లో టాప్ రేంజ్ కి వెళ్లే అవకాశం కూడా ఉందనిపిస్తుంది.
రుక్మిణి వసంత్ నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో ఛాన్స్ అందుకుంది. కచ్చితంగా తెలుగులో ఆ సినిమా తర్వాత రుక్మిణి టాప్ రేంజ్ కి వెళ్తుందని చెప్పొచ్చు. తెలుగులో స్ట్రైట్ సినిమా నిఖిల్ తో ఒకటి చేసినా కూడా ఎన్టీఆర్ సినిమానే ఆమె ఎంట్రీ మూవీ అని ఫిక్స్ అవుతున్నారు.