రుహానీ శర్మ.. క్యూట్ లుక్కులోనే హీటెక్కించేసిందిగా..
టాలీవుడ్‌లో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నటీమణులలో రుహానీ శర్మ ఒకరు.;
టాలీవుడ్‌లో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నటీమణులలో రుహానీ శర్మ ఒకరు. తొలి చిత్రం 'చి.ల.సౌ'లో తన అణకువ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత కూడా ఆమె చేసిన సినిమాలు పెద్దగా హిట్లు కాకపోయినా ఆమెకు ఓ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పడింది. స్క్రీన్‌పై నెచ్చెలి క్యారెక్టర్లతో మెప్పించిన ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ ట్రెండ్‌ను చూపిస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది.
ఇటీవల రుహానీ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వైట్ టీషర్ట్, బ్లాక్ షార్ట్‌లలో ఉన్న ఆమె లుక్స్ అదిరిపోయాయి. స్టైలింగ్‌లో రుహానీ చేసిన ఈ ఫోటో షూట్‌కు నెటిజన్ల నుంచి అదిరే స్పందన వస్తోంది. కెమెరా ముందే కాదు.. కెమెరా వెనుక కూడా తన స్టెయిలిష్ పర్సనాలిటీతో ఆకట్టుకుంటోంది ఈ నటి.
ఆమె హైట్, హార్స్‌ఫుల్ లుక్స్‌కు మిక్స్ అయిన ఈ డ్రెస్ సెలక్షన్ ఆమెకు మరింత ఆకర్షణను తెచ్చిపెట్టింది. కుర్చీలో కూర్చున్న ఫోజ్ నుంచి.. నిలబడ్డ శాట్స్ దాకా, ప్రతీ ఒక్కటి రుహానీ గ్లామర్‌ను ఎలివేట్ చేశాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారడంతో ఆమె ఇన్‌స్టాలో ఫాలోవర్లు మరింత పెరుగుతున్నారు.
ఫొటో షేర్ చేసిన తక్కువ సమయంలోనే 38 వేలకు పైగా లైక్స్ రావడం చూస్తుంటే.. రుహానీకి ఉన్న ఫాలోయింగ్ అర్థమవుతుంది. ప్రస్తుతం ఆమె తమిళం, మలయాళం భాషల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో కొన్ని కొత్త కథలు కూడా ఆమెను టచ్ చేస్తున్నాయట. ఇక ఈ పిక్స్ చూస్తుంటే త్వరలోనే ఓ బిగ్ బ్రేక్ కొట్టే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. సమయానుకూలంగా ట్రెండీ ఫోటోషూట్లతో బిజీగా ఉండే రుహానీ, తన ఫిట్‌నెస్‌ను కూడా చాలా కేర్‌ఫుల్‌గా మెయింటేన్ చేస్తోంది.