ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెరపైకి మహేష్-ఎన్టీఆర్!
అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన `రుద్రమదేవి` ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.;
అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన `రుద్రమదేవి` ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. నటీనటులు సహా గుణశేఖర్ కెరీర్ లో ఓ గొప్ప చారీత్రాత్మక చిత్రంగా నిలిచిపోయింది. అప్పటికే `బాహుబలి` తొలి భాగం విజయంతో తెలుగు సినిమా పేరు ఇండియాలో పేరు మారుమ్రోగిపోయింది. సరిగ్గా అదే సమయంలో మూడు నెలల గ్యాప్ లోనే రుద్రమదేవి కూడా రిలీజ్ తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసింది.
బాహుబలి ఫిక్షనల్ స్టోరీ గా రికార్డులు సృష్టిస్తే చారీత్రాత్మక కథగా రుద్రమదేవి ధైర్యసాహసాహలకు గుణశేఖర్ అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చి గొప్ప చిత్రంగా మలిచారు.తాజాగా `రుద్రమదేవి` రిలీజ్ అయి నేటికి దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు గుణశేఖర్ పంచుకున్నారు. సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కాసేపు కనిపించినా సినిమాకే హైలైట్ గా నిలిచిన పాత్ర అది. అయితే ఆ పాత్ర పోషించడానికి ఎన్టీఆర్, మహేష్ కూడా ఆసక్తి చూపించారని గుణ తెలిపారు.
హాలీవుడ్ చిత్రం `బ్రేవ్ హార్ట్` సినిమా స్పూర్తితో `రుద్రమదేవి` తీసినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ గా తనకు మంచి మార్కెట్ ఉన్నప్పుడే రుద్రమదేవి సినిమా చేయాలనుకున్నానన్నారు.`ఒక్కడు` తర్వాత సౌత్ లో ఏ డైరెక్టర్ కి ఆఫర్ చేయని పారితోషికం తనకు ఆఫర్ చేసారని..ఆ సమయంలోనే `రుద్రమదేవి` సినిమా చేయాలని నిర్ణయించు కున్న ట్లు తెలిపారు. నిర్మాతలకు కథ చెప్పడం నచ్చడం పేపర్లో కాకతీయుల నేపథ్యంలో గుణశేఖర్ సినిమా అంటూ ప్రకటన వచ్చిందన్నారు.
అయితే నిర్మాతలు `రుద్రమదేవి` లేడీ ఓరియేంటెడ్ కథ కావడంతో కథ మార్చమన్నారుట. దానికి గుణ అంగీకరించకపోవడంతో ప్రాజెక్ట్ అప్పట్లో సాధ్య పడలేదన్నారు. అలాగే `ఒక్కడు` తర్వాత ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాలనుకున్నారుట. కానీ సెట్స్ కు వెళ్లాలనుకునే సమయానికి కథ కుదరక పోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపారు.