• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటో స్టోరీ: ఏంది రష్మిక...

ఫొటో స్టోరీ: ఏంది రష్మిక ఈ పని

| రష్మిక మందన్న.. పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిపోయింది ఈ అమ్మడు. సౌత్ టు నార్త్ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

By - Tupaki Desk
Update: 2024-02-19 06:32 GMT

రష్మిక మందన్న.. పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిపోయింది ఈ అమ్మడు. సౌత్ టు నార్త్ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. గతేడాది యానిమల్ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాలో గీతాంజలి పాత్రలో నటించి మెప్పించింది. 2023 డిసెంబర్‌ 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.900 కోట్ల పైగా వసూళ్లు రాబట్టి బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది.


తండ్రీకొడుకుల సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమా.. ఎంత పెద్ద హిట్ అందుకుందో, అదే స్థాయిలో విమర్శలు పాలైంది కూడా. ప్రస్తుతం ఈ మూవీ ఫేమస్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటిల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీకి గాను రష్మిక రూ.4 కోట్లకుపైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

యానిమల్ మూవీ రిలీజ్ అయ్యాక రష్మిక పాత్రపై ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కొన్ని సీన్లలో ఆమె కాస్త బోల్డ్ గా నటించడంతో పాటు నెవ్వర్ బిఫోర్ అనేలా.. లిప్ లాక్స్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్సే ఒకింత నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ స్క్రీన్ షాట్స్ ను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా రన్ బీర్ ను హగ్ చేసుకొని ఉన్న స్టిల్ గా వైరల్ అవుతోంది. అయితే ఆమె ఒక విధంగా పర్ఫెక్ట్ మదర్ రోల్ చేసింది. భర్త పరిస్థితి ఎలా ఉన్నా విడువని ఇల్లాలిగా కనిపించిన విధానం, అలాగే భర్త పై ప్రేమను చూపించిన తీరు కూడా ప్రశంసలు కురిపించింది.

అయితే యాక్టర్ అన్నాక.. పాత్రకు అనుగుణంగా ఏమైనా చేయాల్సి ఉంటుందని మరికొందరు నెటిజన్లు బదులిస్తున్నారు. ఈ సినిమాలో అన్ని వేరియేషన్స్ లో రష్మిక బాగా నటించిందని అంటున్నారు. వాటిని సినిమా పరంగా చూసి వదిలేయాలని సూచిస్తున్నారు. ఇంతకు ముందు రష్మిక కూడా తన పాత్ర విషయంలో మాట్లాడింది. తాను దర్శకుడి ఊహకు ప్రాణం పోయాలనుకునే నటిని అని క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం రష్మిక అనేక ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా గడుపుతోంది. తనకు నేషనల్ క్రష్ బిరుదు ఇచ్చిన పుష్ప మూవీ సీక్వెల్ లో నటిస్తోంది. మరోసారి శ్రీవల్లి పాత్రలో అలరించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ చిత్రంతో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ లో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్ లో చావా మూవీ చేస్తోంది.

Tags:    
  • Rashmika 
  • Gorgeouslooks 
  • Animal 
  • Ranabirkapoor 
  • Filmindsutry 
  • Sandeepreddy 

Similar News

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

2026-11-18 09:53 GMT

Copyright @2026

Powered by Blink CMS