సుమ కొడుకు మూవీ వాయిదా పడినట్లేనా? మరి వచ్చేదెప్పుడు?
యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల గురించి అందరికీ తెలిసిందే. నిర్మలా కాన్వెంట్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన రోషన్.. ఆ సినిమాలో సహాయక పాత్రలో నటించారు.;
యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల గురించి అందరికీ తెలిసిందే. నిర్మలా కాన్వెంట్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన రోషన్.. ఆ సినిమాలో సహాయక పాత్రలో నటించారు. ఆ తర్వాత బబుల్ గమ్ సినిమాతో హీరోగా మారారు. కంటెంట్ ఓకే ఓకేగా ఉన్నప్పటికీ.. డెబ్యూ మూవీతో కమర్షియల్ హిట్ అందుకోలేకపోయారు.
నిజానికి బబుల్ గమ్ మూవీ ప్రమోషన్స్ మామూలుగా జరగలేదు. అనేక స్టార్లు హెల్ప్ చేశారు. డైరెక్టర్ రవికాంత్ కు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది. కానీ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు రోషన్.. మోగ్లీ మూవీపై నమ్మకం పెట్టుకున్నారు. కలర్ ఫోటో వంటి నేషనల్ అవార్డు విన్నింగ్ పిక్చర్స్ తీసిన సందీప్ రాజ్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న మోగ్లీ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో సినిమా ఉండగా.. కొన్ని రోజుల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. వినూత్నమైన కథాంశంతో సినిమా రానున్నట్లు అందరికీ క్లారిటీ వచ్చింది.
దీంతో ఆడియన్స్ దృష్టి మోగ్లీపై పడింది. అయితే డిసెంబర్ 12వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ప్రమోషన్స్ కూడా చేపట్టారు. కానీ ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. మేకర్స్ మరికొన్ని గంటల్లో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మోగ్లీ విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇదంతా అఖండ 2 తాండవం వల్లే! ఎందుకంటే నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. రీసెంట్ గా విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్థిక సమస్యల మధ్య చిక్కుకోవడం వల్ల పోస్ట్ పోన్ అయింది.
ఇప్పుడు డిసెంబర్ 12న అఖండ 2 విడుదల అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అదే రోజు మోగ్లీ రిలీజ్ అయితే ఓపెనింగ్స్ కూడా సాలిడ్ గా దక్కవు. ఆ తర్వాత రోజు రిలీజ్ అయినా వసూళ్లు పెద్దగా రావు. అలా అని డిసెంబర్ 25వ తేదీన విడుదల అనుకుంటే.. అప్పటికే ఆ డేట్ కు అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాబట్టి చేసేదేమి లేక.. మేకర్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరికి మోగ్లీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.