'గిర గిర గింగిరానివే'.. 'ఛాంపియన్' పిల్ల క్యూట్ ప్రోమో
రోషన్ మేక.. మొదటి సినిమా పెళ్లి సందDతో కమర్షియల్ గా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక అ తరువాత అతను సెలెక్ట్ చేసుకుంటున్న కథలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి.;
రోషన్ మేక.. మొదటి సినిమా పెళ్లి సందDతో కమర్షియల్ గా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక అ తరువాత అతను సెలెక్ట్ చేసుకుంటున్న కథలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న 'ఛాంపియన్' సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఆసక్తి రేపిన చిత్ర బృందం, ఇప్పుడు మరో క్రేజీ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. సినిమాలో హీరోయిన్ పాత్రను పరిచయం చేస్తూ 'గిర గిర గింగిరానివే' అనే పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఇది చూసిన వాళ్లంతా హీరోయిన్ అనశ్వర రాజన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫిదా అవుతున్నారు.
ఈ సినిమాలో 'చంద్రకళ' పాత్రలో నటిస్తున్న అనశ్వర రాజన్, ఈ గ్లింప్స్‌లో ఎంతో అందంగా, అల్లరి పిల్లగా ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ పాటలో ఆమె హావభావాలు, కట్టూబొట్టూ అచ్చమైన తెలుగుదనాన్ని గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా "నేనే నా సొంత నాటక సమాజాన్ని తయారుచేసుకొని ఇదే ఊర్లో ప్రదర్శన ఇవ్వకపోతే నా పేరు తాళ్లపూడి చంద్రకళే కాదు" అంటూ ఆమె చెప్పిన డైలాగ్, ఆమె పాత్రలోని ధైర్యాన్ని, పట్టుదలను తెలియజేస్తోంది.
మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఈ గ్లింప్స్‌కు ప్రాణం పోసింది. రామ్ మిరియాల పాడిన 'గిర గిర గింగిరానివే' పాటలోని కొన్ని లైన్లు వింటుంటే చాలా రోజుల తరువాత ఓ కొత్త పాట రానున్నట్లు అర్థమవుతోంది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం విజన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. రోషన్, అనశ్వర మధ్య కెమిస్ట్రీ కూడా చాలా నేచురల్‌గా, క్యూట్‌గా ఉంది. వీరిద్దరి జోడీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయం అనిపిస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ ఫుట్‌బాల్ ఛాంపియన్, బ్రిటిష్ రాణిని కలవాలనే లక్ష్యంతో సాగే ఆసక్తికరమైన కథే ఈ 'ఛాంపియన్'. స్వప్న దత్, ఉమేష్ కుమార్ బన్సాల్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. కథ, కథనంతో పాటు విజువల్స్‌పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
పూర్తి పాటను నవంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే, డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ కానుకగా వస్తున్న ఈ 'ఛాంపియన్' బాక్సాఫీస్ దగ్గర కూడా ఛాంపియన్‌గా నిలుస్తుందో లేదో చూడాలి. మొత్తానికి ఈ గ్లింప్స్ మాత్రం సినిమాపై హైప్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.