కొత్త జానర్‌లో నారా రోహిత్.. ఒక పోస్టర్‌తోనే హైప్

రీసెంట్ గా సుందరకాండ సినిమాతో వినోదభరితమైన ప్రదర్శన ఇచ్చిన ఆయన, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.;

Update: 2026-05-06 09:42 GMT

టాలీవుడ్‌లో కొత్త కాన్సెప్ట్‌లకు ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ మధ్య, యంగ్ హీరో రోహిత్ నారా తన కెరీర్‌ను మరింత వైవిధ్యంగా మలుచుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు. రీసెంట్ గా సుందరకాండ సినిమాతో వినోదభరితమైన ప్రదర్శన ఇచ్చిన ఆయన, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. #RN23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా రోహిత్ కొత్త జానర్‌లో తన సామర్థ్యాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, డెబ్యూ డైరెక్ట‌ర్ చినిమిల్లి మణికుమార్‌తో ఆయన కాంబినేషన్ కుదరడం ఈ ప్రాజెక్ట్‌కు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తోంది.



 


ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. షౌటింగ్ సూన్ స‌రికొత్త ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్, సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. సాధారణంగా టీజర్ లేదా ఫస్ట్ లుక్ ద్వారా హైప్ క్రియేట్ చేసే ట్రెండ్ మధ్య, కేవలం ఒక పోస్టర్ ద్వారానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ఈ టీమ్ స్ట్రాటజీని ప్రత్యేకంగా నిలబెడుతోంది. పోస్టర్‌లో కనిపిస్తున్న కలర్ ఫుల్ డిజైన్ చూస్తుంటే ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అనే సిగ్న‌ల్స్ ను ఇస్తోంది. దీంతో, కథలో ఎమోషన్‌తో పాటు ఎంటర్టైన్‌మెంట్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ను కరణ్ సి ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. కొత్త డైరెక్ట‌ర్ తో సినిమా చేయడం ఒక రిస్క్ అయినప్పటికీ, కంటెంట్‌పై నమ్మకంతోనే ఆయ‌న ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో రీసెంట్ గా కొత్త దర్శకులు వినూత్న కథలతో మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో, #RN23 కూడా ఆ జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రోహిత్ నారా కెరీర్ పరంగా చూస్తే, ఇదొక కీలక మలుపుగా మారవచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

త్వరలోనే శుభ ముహూర్తంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. షూటింగ్ మొద‌ల‌య్యాక ఇత‌ర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు కాబట్టి, టీమ్ ప్లానింగ్ దశలోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడం గమనార్హం. మొత్తానికి, #RN23 ఒక సాధారణ సినిమా ప్రకటనగా కాకుండా, కంటెంట్ ఆధారంగా హైప్ సృష్టించే కొత్త ట్రెండ్‌కు నాంది పలికే ప్రాజెక్ట్‌గా కనిపిస్తోంది. మ‌రి ఈ సినిమాతో నారా రోహిత్ ఆడియ‌న్స్ ను ఏ మేర ఆక‌ట్టుకుంటారో చూడాలి.

Tags:    

Similar News