ఈ విషయంలో కూడా వెంకీ బాటలోనే నితిన్!
ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రాబిన్‌హుడ్ చేరుతున్నట్టు సమాచారం. మే 4వ తేదీన రాబిన్‌హుడ్ సినిమాను అటు టీవీ, ఇటు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి జీ5 సంస్థ సన్నాహాలు చేస్తోంది.;
నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన రీసెంట్ సినిమా రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మంచి అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ మూవీలో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే.
ఈ మధ్య ఓ మోస్తరుగా ఆడుతున్న సినిమాలన్నీ నెల లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్నీ సినిమాలు టాక్ ను బట్టి ఓటీటీల్లోకి వస్తున్నాయి. సినిమా బాగా ఆడి, ఆడియన్స్ ఆ సినిమాను థియేటర్లలో చూస్తుంటేనే ఓటీటీలోకి రావడం లేటవుతుంది తప్పించి లేదంటే చాలా త్వరగానే సినిమా ఆన్‌లైన్ లోకి వచ్చేస్తుంది.
అయితే రాబిన్‌హుడ్ ఓటీటీ, డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి జీ5 స్ట్రీమింగ్ విషయంలో సరికొత్త బాటలో వెళ్తుంది. ఒకేసారి అటు టీవీలోనూ, ఇటు ఓటీటీలోనూ ఆ సినిమాను రిలీజ్ చేసి మంచి టీఆర్పీలతో పాటూ వ్యూస్ ను కూడా సొంతం చేసుకుంటుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ తర్వాత కింగ్‌స్టన్ మూవీ కూడా పాటించింది.
ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రాబిన్‌హుడ్ చేరుతున్నట్టు సమాచారం. మే 4వ తేదీన రాబిన్‌హుడ్ సినిమాను అటు టీవీ, ఇటు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి జీ5 సంస్థ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. రెండుసార్లు వాయిదా పడిన తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ, టీవీలో ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించగా, ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఆడియన్స్ ను బాగా నవ్వించాయి. ప్రమోషన్స్ విషయంలో నితిన్, వెంకీని ఫాలో అయి తెగ ప్రమోషన్స్ చేయగా, ఇప్పుడు వెంకీ సినిమాలానే తన రాబిన్‌హుడ్ కూడా ఒకేసారి అటు ఓటీటీ, టీవీలోకి రానుండటం యాదృచ్ఛికమే. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలానే రాబిన్‌హుడ్ సినిమా కూడా జీ5కు మంచి టీఆర్పీలు తీసుకొస్తుందేమో చూడాలి.