• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నారా రోహిత్ సినిమాకు...

నారా రోహిత్ సినిమాకు కొర‌టాల క్లాప్

| టాలీవుడ్‌లో కొత్త తరం హీరోల లిస్ట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రోహిత్ నారా మరోసారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-05-11 09:36 GMT

టాలీవుడ్‌లో కొత్త తరం హీరోల లిస్ట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రోహిత్ నారా మరోసారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా, కథలో బలం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్న రోహిత్ నారా ఇప్పుడు #RN23తో మరో ఇంట్రెస్టింగ్ జ‌ర్నీని ప్రారంభించారు. ఈ సినిమా కేవలం మరో ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, యూత్ ఆలోచనలకు దగ్గరగా ఉండే ఎంట‌ర్టైనింగ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటుండటం విశేషం. ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఫన్‌తో పాటు ఫీల్ ఉండాల‌ని కోరుకుంటున్న నేప‌థ్యంలో అదే ఫార్ములాను ఈ సినిమా బలంగా అందుకోబోతుందనే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.

క‌ర‌ణ్ సి ప్రొడ‌క్ష‌న్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆ సంస్థకు ఐదో ప్రొడక్షన్ కావడం మరో ప్రత్యేకత. చిన్న సినిమాల మార్కెట్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ స్టోరీల‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్లాన్డ్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో చినిమిల్లి మ‌ణికుమార్ డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సాధారణంగా డెబ్యూ డైరెక్ట‌ర్‌ల‌పై ఉండే అనుమానాలను పక్కనపెడితే, ఒరిజినల్ కథలపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న క్రేజ్ ఈ సినిమాకు బలంగా మారే అవకాశముంది.

ఇక అస‌లు విష‌యానికొస్తే తాజాగా జ‌రిగిన‌ ఈ సినిమా ప్రారంభోత్సవం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ క్లాప్ కొట్టి ప్రారంభించగా, నిర్మాత దిల్ రాజు తొలి షాట్‌కు దర్శకత్వం వహించడం, చడలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేయడం వంటి ఘట్టాలు సినిమాపై ఉన్న నమ్మకాన్ని చూపించాయి. ఒక కొత్త డైరెక్ట‌ర్ ప్రాజెక్ట్‌కు ఇండస్ట్రీలోని ప్రముఖులు ఇలా మద్దతు ఇవ్వడం వెనుక కథలో ఉన్న బలం కూడా కారణమనే చర్చ వినిపిస్తోంది.

న‌య‌న్ సారిక ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, నటీనటుల ఎంపిక కూడా సినిమాకు మరో ప్లస్‌గా మారింది. న‌రేష్ వీకే, వెన్నెల కిషోర్, రోహిణి లాంటి నటులు ఉండటంతో ఎంట‌ర్‌టైన్మెంట్, ఎమోష‌న్స్ కు సమాన ప్రాధాన్యం ఉండబోతుందని అర్థమవుతోంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్, నరేష్ నేచుర‌ల్ యాక్టింగ్, రోహిణి ఎమోష‌నల్ స్ట్రెంగ్త్ సినిమాను ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు మ‌రింత ద‌గ్గ‌ర చేసే అవకాశముంది.

ఆల్రెడీ రిలీజైన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ ఆడియ‌న్స్ లో వినూత్న ఆసక్తిని రేకెత్తించింది. టైటిల్‌ను ఇంకా అనౌన్స్ చేయ‌క‌పోయినా, పోస్టర్ డిజైన్ చూస్తే ఇది పూర్తిగా ఎనర్జిటిక్, కలర్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ షూట్‌కు రెడీ అవుతున్న RN23పై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడగా, రోహిత్ నారా కెరీర్‌లో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.


డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ తో మొదలైన నారా రోహిత్ కొత్త సినిమా#NaraRohith #NayanSarika #KoratalaSiva #Tollywood #Tupaki

Follow👉 @tupaki_official pic.twitter.com/I48TImbBa3

— Tupaki (@tupaki_official) May 11, 2026


Tags:    
  • rn23 
  • rohithnara 
  • telugucinema 
  • upcomingmovie 
  • nayanasrika 
  • vennelakishore 
  • koratalasiva 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS