RK సాగర్ నెక్స్ట్ బిగ్ అటెంప్ట్..!
సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించిన ఆర్కే సాగర్ ఈమధ్యనే 100 అనే సినిమాతో లీడ్ రోల్ లో సినిమా చేశాడు.;
సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించిన ఆర్కే సాగర్ ఈమధ్యనే 100 అనే సినిమాతో లీడ్ రోల్ లో సినిమా చేశాడు. ఆ సినిమాలో ఆర్కే సాగర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించాడు. ఐతే ఈ సినిమా తర్వాత ఆర్కే సాగర్ తన నెక్స్ట్ అటెంప్ట్ గా ఒక భారీ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. జీవన్ రెడ్డి డైరెక్షన్ లో సింగరేణి నేపథ్యంతో ఈ సినిమా రాబోతుంది. సింగరేణి కార్మికుల కష్టాలు వారి నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట.
స్వతహాగా ఆ ఎక్స్ పీరియన్స్..
జార్జి రెడ్డి సినిమాను డైరెక్ట్ చేసిన జీవన్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సింగరేణి ఫ్యామిలీస్ లో ఉండే ఎమోషన్స్, కష్టాలను ఈ సినిమా చూపిస్తామని చిత్ర యూనిట్ చెబుతున్నారు. స్వతహాగా ఆ ఎక్స్ పీరియన్స్ ఉంది కాబట్టి సింగరేణి ఫ్యామిలీస్ జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తామని హీరో ఆర్కె సాగర్ అంటున్నాడు.
ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సింగరేణి అండర్ గ్రౌండ్ గనులను ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్స్ వేసి చేస్తున్నారట. ఇక సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే RK సాగర్ నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ స్టార్ హీరో స్పెషల్ క్యామియో చేస్తున్నారట. ఆర్కే సాగర్ నటించే ఈ సినిమాకు సపోర్ట్ అందిస్తున్న ఆ స్టార్ ఎవరన్నది బయటకు రాలేదు.
సీరియల్స్ లో తన స్టార్ ఇమేజ్ ని సినిమాల్లోకి..
సీరియల్స్ లో తన స్టార్ ఇమేజ్ ని సినిమాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయాలని చూస్తున్నాడు ఆర్కే సాగర్. 100 సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా కొంతమందిని మెప్పించింది. ఐతే ఈ సింగరేణి నేపథ్యంతో వస్తున్న సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన ఇంపాక్ట్ చూపించాలని చూస్తున్నాడు RK సాగర్. హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు ఆర్కె సాగర్. ఐతే 100 సినిమాకు పవర్ స్టార్ తో ట్రైలర్ రిలీజ్ చేయించి హడావిడి చేశారు. ఐతే నెక్స్ట్ సినిమాకు కూడా స్టార్ హీరో సపోర్ట్ గా క్యామియో రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.
సీరియల్స్ లో ఆర్కె సాగర్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఐతే దాన్ని సినిమాలకు కూడా కన్వర్ట్ చేయాలని చూస్తున్నాడు. ఐతే ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో తన టాలెంట్ చూపించాలని చూస్తున్న సాగర్ కి ఏమేరకు లక్ కలిసి వస్తుందో చూడాలి.