ఛాన్స్ ఇస్తే సత్తా చాటే భామలే!
ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. కానీ నిలబడేది కొందరే. సక్సెస్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే నిలదొక్కుకునేది.;
ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. కానీ నిలబడేది కొందరే. సక్సెస్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే నిలదొక్కుకునేది. హీరోయిన్ గా లాంగ్ కెరీర్ కి అవకాశం దక్కుతుంది. సక్సెస్ అయిన భామలందరి విషయంలో ఇదే జరిగింది. ఏడాది కాలంలో చాలా మంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేసారు. కానీ నిలబడ లేకపోయారు. గుర్తింపు దక్కినా కూడా సెకెండ్ ఛాన్స్ అందుకోవడంలో విఫలమ య్యారు. మరి ఈ భామల విషయంలో అదృష్టం ఎలా ఉందో చూడాలి. `మిరాయ్` సినిమాతో ఢిల్లీ బ్యూటీ రితికా నాయక్ మంచి సక్సెస్ అందుకుంది.
ఢిల్లీ నుంచి దిగిన భామలు:
అందం,అభినయంతో ఆకట్టుకుంది. యూత్ లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించింది. కాని డెబ్యూ చిత్రం ఇది కాదు. `అశోక వనంలో అర్జున కల్యాణం`తో లాంచ్ అయింది. ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. నాని నటించిన `హాయ్ నాన్న`లోనూ క్యామియో అప్పిరియన్స్ ఇచ్చింది. కానీ `మిరాయ్` తోనే కమర్శియల్ సక్సస్ అందుకుంది. మరి ఈ విజయం అమ్మడికి టాలీవుడ్ లో ఎంత స్ట్రాంగ్ గా నిలబెడుతుందో చూడాలి. ప్రస్తుతం తెలుగులో `డ్యూయెట్` లో నటిస్తోంది. దీంతో పాటు వీటీ 15 లోనూ నటిస్తోంది.
ఆ హిట్ తో మాలీవుడ్ లోనూ సక్సెస్:
అదే ఢిల్లీ నుంచి దిగిన యుక్తి తరేజా ఇటీవల రిలీజ్ అయిన `కె-ర్యాంప్` తో మంచి విజయం అందుకుంది. దీంతో అమ్మడు నెట్టింట వైరల్ గానూ మారింది. ఈ సినిమా కంటే ముందే `రంగబలి`తో టాలీవుడ్ లో లాంచ్ అయినా ఫలితం నిరాశ పరించింది. `మార్కో`తో మాలీవుడ్ లోనూ సక్సెస్ అందుకుంది. మరి ఈ విజయాలు టాలీవుడ్ భవిష్యత్ ని ఎలా నిర్దేశిస్తాయో చూడాలి. ప్రస్తుతం తెలుగులో `కింగ్ జాకీ క్వీన్` లో..కన్నడలో ఓ చిత్రంలోనూ నటిస్తోంది.
రాజమండ్రి నుంచి రాంబాయి:
ఇటీవలే రిలీజ్ అయిన `రాజు వెడ్స్ రాంబాయి` తో తేజస్వీరావు అనే తెలుగమ్మాయి ఎంత సంచలనమైందో తెలిసిందే. రాజమండ్రి నుంచి దిగి హీరోయిన్ గా తొలి సినిమాతోనే సక్సస్ అందుకుంది. తూర్పు గోదావరి పిల్ల అయినా? తెలంగాణ యాస భాషలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మంచి పెర్పార్మర్ అనే ట్యాగ్ దక్కించుకుంది. నేచురల్ బ్యూటీతో కుర్రకారుని ఆకట్టుకుంది. మరి ఈ నటికి సొంత పరిశ్రమ ఎలాంటి అవకాశాలు కల్పిస్తుందో చూడాలి. ఈ ముగ్గురు భామలు సక్సస్ అయితే గనుక మీడియం రేంజ్ హీరోలకు కలిసొస్తుంది. దర్శకులకు కొత్త హీరోయిన్లు వెతుక్కునే పనిభారం తగ్గుతుంది.