పడమటివీధి జానకి.. ఈ పిల్ల మామూలుగా లేదు గురూ!
పక్కా రా అండ్ రస్టిక్ కంటెంట్ కు ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంది.
పక్కా రా అండ్ రస్టిక్ కంటెంట్ కు ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇదే ఫార్ములాతో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ కల్ట్ మూవీ పవర్ పేట. ఈ సినిమా నుంచి హీరోయిన్ రితిక నాయక్ పుట్టినరోజు సందర్భంగా పడమటివీధి జానకి క్యారెక్టర్ గ్లింప్స్ వదిలారు. ఈ వీడియో చూస్తుంటే కుర్రాళ్లకి కిక్ ఇచ్చేలా పక్కా మాస్ మీటర్ లో అదిరిపోయింది.
గ్లింప్స్ లో రితిక నాయక్ మేకోవర్ భలే ఫ్రెష్ గా సెట్ అయింది. ఇంట్లో ఊయల మీద వింటేజ్ లంగాఓణీ వేసుకుని కూర్చున్న లుక్ అయినా, బజార్ లో పబ్లిక్ మధ్య లాలీపాప్ తింటూ స్టైల్ గా నడిచొచ్చే సీన్ అయినా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. వర్షంలో పసుపు రంగు చీరలో తడుస్తూ ఆమె వేసిన స్టెప్పులు స్క్రీన్ మీద ఒక కొత్త గ్రేస్ తీసుకొచ్చాయి.
ఇలాంటి రస్టిక్ బ్యాక్ డ్రాప్ కథలు తెలుగులో రావడం చాలా రేర్. దర్శకుడు కృష్ణ చైతన్య మేకింగ్ స్టైల్ గురించి ఇక్కడ కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయన రొటీన్ ఫార్ములాలు వదిలేసి రియలిస్టిక్ క్యారెక్టర్లు డిజైన్ చేయడంలో స్పెషలిస్ట్. ఇదివరకే రౌడీ ఫెలో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలతో తన స్టైల్ ఏంటో చూపించాడు. ఇప్పుడు పవర్ పేటలో అంతకుమించి కంటెంట్ తో థ్రిల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ గ్లింప్స్ లో ప్రతి ఫ్రేమ్ లో ఆయన డీటెయిలింగ్ స్పష్టంగా తెలుస్తోంది. ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాలో ఇంత కలర్ ఫుల్ లవ్ ట్రాక్ ను బ్యాలెన్స్ చేయడం ఆయన టేకింగ్ కే చెల్లింది. ఈ చిన్న గ్లింప్స్ ఇంతలా ఎలివేట్ అవ్వడానికి టెక్నికల్ టీమ్ సపోర్ట్ గట్టిగానే ఉంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జానకి క్యారెక్టర్ కు ఒక క్లాసిక్ ఫీల్ యాడ్ చేసింది. మధి సినిమాటోగ్రఫీ ఆ వింటేజ్ మూడ్ ను పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్ గా కుదిరింది.
70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి దీన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన సేనాపతి రవి బర్త్ డే గ్లింప్స్ కు ట్రేడ్ సర్కిల్స్ లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. అప్పటినుంచే ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఈ జానకి వీడియో ఆ పాజిటివ్ వైబ్స్ ను మరింత పైకి తీసుకెళ్లింది. లవ్, ఆనర్, పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పవర్ ఫుల్ యాక్షన్ తో పాటు స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను కూడా ఈ పవర్ పేటలో చూడొచ్చు. ఇక త్వరలోనే మేకర్స్ మరిన్ని అప్డేట్స్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.