మ్యూజియం.. ఫైటింగ్ రింగ్.. రౌడీ మార్క్ వీకెండ్!
విజయ్ దేవరకొండ స్టైల్ సెన్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆయన వేసుకునే డ్రెస్, పెట్టుకునే గాగుల్స్, హెయిర్ స్టైల్ ఏదైనా సరే కుర్రాళ్లకు అదొక ఫ్యాషన్ స్టేట్ మెంట్ లా మారిపోతుంటుంది.
విజయ్ దేవరకొండ స్టైల్ సెన్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆయన వేసుకునే డ్రెస్, పెట్టుకునే గాగుల్స్, హెయిర్ స్టైల్ ఏదైనా సరే కుర్రాళ్లకు అదొక ఫ్యాషన్ స్టేట్ మెంట్ లా మారిపోతుంటుంది. అయితే ఈసారి ఆయన షేర్ చేసిన ఫొటోలు కేవలం డ్రెస్సింగ్ స్టైల్ తోనే కాకుండా వెళ్లిన లొకేషన్స్ తో కూడా నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అబుదాబి వీధుల్లో విజయ్ గడిపిన క్రేజీ వీకెండ్ తాలూకు విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈ వెకేషన్ లో విజయ్ తన టేస్ట్ కు తగ్గట్టుగా పూర్తిగా భిన్నమైన ప్రదేశాలను ఎంచుకున్నాడు. ముందుగా అబుదాబిలోని ఫేమస్ 'లూవ్రే' మ్యూజియాన్ని సందర్శించి అక్కడి చారిత్రక వస్తువులను ఆసక్తిగా తిలకించాడు. బ్లాక్ డ్రెస్, క్యాప్ తో పొడవాటి జుట్టు, గుబురు మీసాలతో ఉన్న రౌడీ హీరో.. గుర్రాలపై ఉన్న పురాతన యుద్ధవీరుల పెయింటింగ్స్ ముందు ముందు నిలబడి ఇచ్చిన ఫోజులు వింటేజ్ ఫీల్ ను తీసుకొచ్చాయి.
మ్యూజియం ప్రశాంతత నుంచి నేరుగా అడ్రినలిన్ రష్ ఇచ్చే ఫైటింగ్ అరేనాకు షిఫ్ట్ అయ్యాడు విజయ్. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న యూఎఫ్ సీ 333 ఈవెంట్ కు హాజరై, ఎతిహాద్ అరేనాలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా ఎంజాయ్ చేశాడు. బ్రౌన్ జాకెట్, బ్లాక్ ప్యాంట్ లో రింగ్ పక్కన నిలబడి ఆయన ఇచ్చిన స్టిల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలెగ్జాండర్ వోల్కనోవ్స్కీ తన ప్రత్యర్థి మొవ్సార్ ఎవ్లోయెవ్ను రెండో రౌండ్లోనే మట్టికరిపించిన ఈ క్రేజీ మ్యాచ్ ను విజయ్ చాలా అగ్రెసివ్ గా ఆస్వాదించినట్లు తెలుస్తోంది.
ఈ రెండు భిన్నమైన వాతావరణాల మధ్య అబుదాబి లోకల్ ఫుడ్ ను కూడా గట్టిగానే లాగించేశాడు మనోడు. రెస్టారెంట్ లో క్యాప్, సన్ గ్లాసెస్ పెట్టుకుని రెట్రో లుక్ లో దర్శనమిచ్చాడు. తన టేబుల్ ముందుకు వచ్చిన స్పెషల్ డిషెస్ వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇలా ఒకే ట్రిప్ లో మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించి ఫ్యాన్స్ కు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చాడు విజయ్. "పగలు లూవ్రే, రాత్రి యూఎఫ్ సీ, మధ్యలో మంచి భోజనం.. ఇదీ నా అబుదాబి వీకెండ్" అంటూ ఈ ఫొటోలకు సరదాగా క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల లైక్స్ తో వైరల్ గా మారింది.
రీసెంట్గా విజయ్ దేవరకొండ 'రణబాలి'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియడ్ యాక్షన్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఇక విజయ్ ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్దన' చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీని తర్వాత 'హాయ్ నాన్న' దర్శకుడు శౌర్యువ్‌తో మరో ప్రాజెక్ట్ కూడా ప్రకటించారు.