బయోపిక్‌పై బాక్సింగ్ లెజెండ్ అసంతృప్తి!
దేశానికి ప్రపంచ వేదికపై ఎన్నో పతకాలు తెచ్చిపెట్టి బాక్సింగ్ లెజెండ్‌గా నిలిచిన మేరీ కోమ్ జీవితంపై తెరకెక్కిన సినిమా గురించి ఓ ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు.
దేశానికి ప్రపంచ వేదికపై ఎన్నో పతకాలు తెచ్చిపెట్టి బాక్సింగ్ లెజెండ్‌గా నిలిచిన మేరీ కోమ్ జీవితంపై తెరకెక్కిన సినిమా గురించి ఓ ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. 2014లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన `మేరీ కోమ్` బయోపిక్ సినిమా తన వాస్తవ జీవితాన్ని పూర్తిగా ప్రతిబింబించలేదని స్పష్టం చేశారు. తన కష్టాలు, పోరాటంలో 10 శాతం మాత్రమే చిత్రంలో చూపించారని.. సినిమా అంతగా రియలిస్టిక్‌గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి బయటకు వచ్చిన అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మేరీ కోమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవిత కథ ఆధారంగా వచ్చిన ఆ బయోపిక్‌కు సీక్వెల్ ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించగా? ఇకపై ఎలాంటి సీక్వెల్ అవసరం లేదని తేల్చిచెప్పారు. తన ప్రయాణం ఇప్పటికే ఆ సినిమాలోను, తన `అన్‌బ్రేకెబుల్` పుస్తకంలోనూ స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. అయితే సినిమా మాత్రం తన అసలు కష్టాలను చూపించడంలో విఫలమైందన్నారు.
సినిమాలో చూపించినదానికంటే నిజ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయని మేరీ కోమ్ స్పష్టం చేశారు. అసలైన కష్టాలు, చెమటోడ్చి చేసిన కృషి పూర్తిగా తెలియాలంటే తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని చదవాల్సిందేనని సూచించారు. సినిమా అనేది కేవలం కమర్షియల్ హంగులతో రూపొందిందని.. అందువల్ల తన సుదీర్ఘ పోరాటంలో కేవలం కొద్దిపాటి భాగాన్ని మాత్రమే తెరపై ఆవిష్కరించ గలిగారని అభిప్రాయపడ్డారు.
అలాగే బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనుభవాలను కూడా మేరీకోమ్ పంచుకున్నారు. ఆ షోలో తాను ఎక్కడా నటిస్తూ ఫేక్‌గా ప్రవర్తించలేదని నిజమైన వ్యక్తిత్వాన్నే ప్రజల ముందుంచానని స్పష్టం చేశారు. 20 సంవత్సరాల పాటు దేశం కోసం బాక్సింగ్ ఆడుతూ ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేశానని.. ఒక క్రీడాకారిణి పడిన కష్టాలు ఏంటో? బిగ్ బాస్ వేదిక ద్వారా ప్రేక్షకులకు మరింత స్పష్టంగా తెలిశాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఓవైపు సినిమా తన జీవితాన్ని వంద శాతం చూపించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. మరోవైపు రియాలిటీ షోలో మాత్రం తన నిజమైన రూపం ప్రేక్షకులకు చేరువైందని సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. తెరపై కనిపించే గ్లామర్ .. విజయాల వెనుక ఎంతటి అలుపెరగని శ్రమ ఉంటుందో మేరీ కోమ్ మాటలు మరోసారి నిరూపించాయి. ఒక అథ్లెట్‌గా ఆమె పడిన ఇబ్బందులు రికార్డులకు, పుస్తకాలకు మాత్రమే పరిమితం కాలేదని తెలుస్తోంది.