'హుషారు 2' టీజర్.. డబుల్ మ్యాడ్‌నెస్‌లో ఎర్రన్న సర్ ప్రైజ్
కుర్రకారును ఓ ఊపు ఊపిన కల్ట్ బాయ్స్ మళ్లీ వచ్చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్టయిన 'హుషారు'కు సీక్వెల్ గా రాబోతున్న 'హుషారు 2' టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది.
కుర్రకారును ఓ ఊపు ఊపిన కల్ట్ బాయ్స్ మళ్లీ వచ్చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్టయిన 'హుషారు'కు సీక్వెల్ గా రాబోతున్న 'హుషారు 2' టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది. దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి ఈసారి రెట్టింపు మ్యాడ్ నెస్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడని అర్థమవుతుంది. మొదటి పార్ట్ తో పోలిస్తే ఈసారి స్కేల్ తో పాటు కథా నేపథ్యం కూడా భారీగా మారడం ఆసక్తిని పెంచుతోంది.
గతంలో లాగా కేవలం సిటీ బ్యాక్ డ్రాప్, పబ్స్ కే పరిమితం కాకుండా, ఈసారి కుర్రాళ్ల గ్యాంగ్ ను ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. టీజర్ మొదట్లోనే 'చిత్రగుంజ్' అనే ఒక భయంకరమైన ప్రాంతాన్ని పరిచయం చేశారు. ఒకవైపు రక్తంతో రాజ్యాన్ని ఏలే రాక్షస పాలకులు, మరోవైపు అడవిలో క్రూరంగా వేటాడే సాయుధులు.. ఈ రెండు వర్గాల మధ్య నలిగిపోతున్న ప్రజలు.. ఇలా ఒక ఇంటెన్స్ సెటప్ తో దర్శకుడు కథను ఓపెన్ చేశాడు.
అయితే ఆ సీరియస్ వాతావరణంలోకి కల్ట్ బాయ్స్ ఎంట్రీ ఇవ్వడంతో అసలు రచ్చ మొదలైంది. హాలిడే ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ఈ బ్యాచ్, ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుని పడే పాట్లు ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తున్నాయి. లాస్ట్ టైమ్ కేవలం బీర్ తో ఎంజాయ్ చేస్తే.. ఈసారి ఏకంగా టెక్విలా షాట్స్ అంటూ రాహుల్ రామక్రిష్ణ ఎంటర్టైన్మెంట్ కూడా హైలెట్ అవుతోంది. పామును చూసి వణికిపోవడం, అమ్మాయిలతో పులిహోర కలపడం లాంటి సీన్స్ వాళ్ల పాత బ్రాండ్ ను పర్ఫెక్ట్ గా కంటిన్యూ చేస్తున్నాయి.
సన్నీ ఎంఆర్, రామ్ మిరియాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు బలంగా నిలిచింది. పక్కా మాస్ బీట్స్ తో విజువల్స్ కు తగ్గ ఎనర్జీని ఇచ్చారు. డైరెక్టర్ శ్రీహర్ష ఒక క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాను, అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ కామెడీని బ్యాలెన్స్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ఎక్కడా బోర్ కొట్టకుండా, ఫాస్ట్ కట్స్ తో ఈ ఫ్రాంచైజీ ఏ పేస్ లో సాగనుందో ముందుగానే హింట్ ఇచ్చేశారు.
ఒకవైపు పవర్ఫుల్ విలన్స్, మరోవైపు గిరిజన వేషధారణలో ఉన్న మనుషులు.. వీళ్ల మధ్యలో ఇరుక్కున్న హుషారు కుర్రాళ్ల గ్యాంగ్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తే యాక్షన్ ఎపిసోడ్స్ మంచి థ్రిల్ ఇస్తున్నాయి. గాల్లో ఎగురుతూ జీపులు పేలిపోవడం, నలుగురూ కలిసి బందీలుగా మారిన ట్రాక్ కచ్చితంగా థియేటర్లలో హిలేరియస్ గా వర్కౌట్ అయ్యేలా ఉంది. కేవ్‌మ్యాన్ స్టోరీస్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రం విజువల్ గానూ చాలా రిచ్ గా కనిపిస్తోంది.
ఇక ఈ టీజర్ కు అసలైన హైలైట్, దిమ్మతిరిగే సర్ ప్రైజ్ మాత్రం చివర్లోనే దాచారు. నేరుగా వెళ్లి పులి బోనులో పడ్డాం అనుకుంటున్న సమయంలో, 'పీపుల్స్ స్టార్' ఎర్రన్న ఆర్ నారాయణమూర్తి ఎర్ర కండువా, చేతిలో తుపాకీ పట్టుకుని సాలిడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ గెటప్ లో "తమ్ముళ్లూ.. వేట మొదలెడదామా" అంటూ ఆయన చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ టీజర్ కే బిగ్గెస్ట్ అసెట్ గా నిలిచింది. ఈ ఊహించని క్రేజీ క్యాస్టింగ్ తో 'హుషారు 2'పై బజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది.