హిమాల‌యాల్లో స‌న్యాసిగా హీరోయిన్!

ఇందులో రితికా నాయ‌క్ తేజ స‌జ్జాకు జోడీగా న‌టించింది. అన్ని ప‌నులు పూర్తిచేసుకున్న చిత్రం మ‌రికొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.;

Update: 2025-09-11 08:31 GMT

ఢిల్లీ బ్యూటీ రితికా నాయ‌క్ సుప‌రిచిత‌మే.'అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం'తో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అటుపై 'హాయ్ నాన్న‌'లో గెస్ట్ అప్పిరియ‌న్స్ తో అల‌రించింది. ఈ రెండు సినిమాలు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. అదే క్రేజ్ తో పాన్ ఇండియా చిత్రం 'మిరాయ్' లో ఛాన్స్ అందుకుంది. అమ్మ‌డిలో అస‌లైన ట్యాలెంట్ ఈ సినిమాతో బ‌య‌టపడ‌బోతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు సినిమాకు మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. దీంతో అంచ‌నాలు బాగానే ఉన్నాయి.

ఇందులో రితికా నాయ‌క్ తేజ స‌జ్జాకు జోడీగా న‌టించింది. అన్ని ప‌నులు పూర్తిచేసుకున్న చిత్రం మ‌రికొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మ‌రి ఈ సినిమాలో రితిక పాత్ర ఎలా ఉండ‌బోతుంది? అన్న‌ది తాజాగా రివీల్ చేసింది. సినిమాలో 'విభ' అనే పాత్ర‌లో రితిక అల‌రించనుంది. హిమాల‌యాల్లో ఉండే సన్యాసి పాత్ర అది. నిజ జీవితానికి భిన్న‌మైన పాత్ర‌లో న‌టించ‌డం స‌వాల్ గానే అనిపించిందంది. నో రెప్పుడు ఖాళీగా ఉండ‌ద‌ని..ఎప్పుడూ ఏదో ఒక‌టి మాట్లాడుతూనే ఉంటానంది.

కానీ సినిమాలో మాత్రం స‌న్యాసిగా త‌క్కువ‌గా మాట్లాడ‌టం..ఎక్కువ ధ్యానంలో ఉండ‌టం...ప్ర‌శాంతంగా క‌నిపించ‌డం క‌ష్టంగా ఉండేదంది. కానీ ఈ పాత్ర సినిమాలో బ‌లంగా ఉంటుందంది. సినిమాలో చాలా స‌న్నివేశాల‌న్ని రియ‌ల్ లోకేష‌న్స్ లోనే షూట్ చేసిన‌ట్లు తెలిపింది. మంచు ప‌ర్వాతాలు, అడ‌వుల మ‌ధ్య షూటింగ్ కష్టంగా, సాహ‌సంగా అనిపించినా? ఇష్టంగా ప‌ని చేసానంది. త‌న పాత్ర ఎలా ఉంటుంద‌న్న‌ది? తెర‌పై చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులే నిర్ణ‌యించాల‌ని తెలిపింది. రెండున్న‌రేళ్ల పాటు సినిమా కోసం ప‌ని చేసామంది.

ఫాంట‌సీ, ప్రేమ‌, యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే చిత్రంగా పేర్కొంది. తొలి రెండు సినిమాలు మంచి గుర్తింపు నిచ్చిన నేప‌థ్యంలో `మిరాయ్` తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మరింత ద‌గ్గ‌ర‌వుతాన‌న్న ధీమాను వ్య‌క్తం చేసింది. రిత‌క ఇత‌ర ప్రాజెక్ట్ ల విష‌యానికి వ‌స్తే? వ‌రుణ్ తేజ్ కి జోడీగా 'డ్యూయెట్' లో న‌టిస్తోంది. ఈ సినిమాతో పాటు, మ‌రో ప్రాజెక్ట్ కూడా క‌మిట్ అయిన‌ట్లు తెలిపింది. తెలుగు అర్ద‌మ‌వుతుంది. మాట్లాడ‌డం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదంది. వీలైనంత వ‌ర‌కూ త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటాన‌ని తెలిపింది.

Tags:    

Similar News